NYE 2026 పార్టీ : రాజమౌళితో- జోనాస్‌తో పీసీ ఎలా?
బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే హాలీవుడ్ లోను అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా, ఆ తర్వాత నిక్ జోనాస్‌ని పెళ్లాడి అమెరికాలో సెటిలైన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 2 Jan 2026 11:39 PM ISTబాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే హాలీవుడ్ లోను అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా, ఆ తర్వాత నిక్ జోనాస్‌ని పెళ్లాడి అమెరికాలో సెటిలైన సంగతి తెలిసిందే. అమెరికాలో ఉన్న సమయంలోనే అక్కడ హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ, వెబ్ సిరీస్ లతోను మంచి పేరు తెచ్చుకుంది. క్వాంటికో, సిటాడెల్ లాంటి సిరీస్ లలో పీసీ నటనకు అద్భుతమైన పేరొచ్చింది. ఆ రెండు సిరీస్ లలో యాక్షన్ క్వీన్ గా, సూపర్ గాళ్ తరహా పాత్రల్లో అద్భుత నటనతో అలరించింది.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా భారీ పాన్ వరల్డ్ సినిమా వారణాసిలో నటిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో పీసీ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా మూవీపై క్రేజ్ నెలకొంది. ఇక ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు, మహేష్ లుక్ ని, టైటిల్ ని లాంచ్ చేసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వారణాసి టైటిల్ కూడా ఎంతో ఎగ్జయిట్ చేసింది. పీసీ ఈ చిత్రంలో ట్రెడిషనల్ అవతార్ లో కనిపిస్తూనే యాక్షన్ క్వీన్ గా రక్తి కట్టించనుందని వారణాసి టైటిల్ పోస్టర్ వెల్లడించింది.
వారణాసి గురించి పీసీ అంతగా చర్చించకపోయినా కానీ, ఈ మూవీ టీమ్ తో తను ఎంత బాగా సింక్ అయిపోయిందో ఇప్పటికే షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్, వీడియోలు వెల్లడించాయి. ఇంతకుముందు మహేష్- పృథ్వీరాజ్ సుకుమారన్ లతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసిన పీసీ, పలుమార్లు జక్కన్నతో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలను కూడా షేర్ చేసింది. ఇప్పుడు న్యూఇయర్ సందర్భంగా రాజమౌళితో కలిసి డ్యాన్సులు చేస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. రాజమౌళి ఇందులో చక్కగా స్టెప్పులేసారు.
ఇక న్యూఇయర్ 2026 సెలబ్రేషన్స్ కోసం ప్రియాంక చోప్రా, ఇప్పటికే అమెరికాలో ఉంది. అక్కడ జోనాస్ బ్రదర్స్ కాన్సెర్టులో సందడి చేసింది. అలాగే తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్తీతో కలిసి ఎంతో హ్యాపీగా జాలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. డిసెంబర్ 31 మిడ్ నైట్ పార్టీలో జోనాస్ బ్రదర్స్ అంతా పార్టీలో సందడి చేయగా, నిక్ జోనాస్ తో కలిసి వేదికపైనా కనిపించింది పీసీ. మొత్తానికి ఈ కొత్త సంవత్సరం పార్టీని ఈ బ్యూటీ ఒక రేంజులో సెలబ్రేట్ చేసిందని తాజాగా విడుదలైన ఫోటోలు, వీడియోలు వెల్లడిస్తున్నాయి. ఇక రాజమౌళి అండ్ టీమ్ తో గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా ఎంతగా కలిసిపోయిందో తాజా వీడియో చెబుతోంది. అయితే 31 మిడ్ నైట్ పార్టీ రాజమౌళితో, అదే సమయంలో అమెరికాలో జోనాస్ బ్రదర్స్ తో ఎలా పాజిబుల్? అంటూ సందేహం వ్యక్తమైంది. జక్కన్న తో అడ్వాన్స్ డ్ గా పార్టీ ముగిశాక పీసీ జోనాస్ బ్రదర్స్ తో పార్టీలో జాయినైందా? అన్నది తెలియాల్సి ఉంది. వారణాసి పాన్ వరల్డ్ లో అత్యంత భారీగా విడుదల కానుంది. ఈ సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న పీసీ ప్రధాన అస్సెట్ కానుంది.
