Begin typing your search above and press return to search.

బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వ‌స్తే చుల‌క‌న‌గా చూస్తారు

ప్రియాంక రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ, తాను సొంతంగా నిర్మాణ సంస్థ ను మొద‌లుపెట్ట‌డానికి గ‌ల కార‌ణాన్ని వెల్ల‌డించారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   15 Sept 2025 11:00 PM IST
బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వ‌స్తే చుల‌క‌న‌గా చూస్తారు
X

ఇండ‌స్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ల‌కు ఓ ట్రీట్‌మెంట్ ఉంటే ఆ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన వారికి ఇంకో ర‌క‌మైన ట్రీట్‌మెంట్ ఉంటుంది. తాను కూడా మొద‌ట్లో అలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొన్నాన‌ని చెప్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ప్రియాంక 2000 సంవ‌త్స‌రంలో మిస్ వ‌ర‌ల్డ్ కిరిటాన్ని సొంతం చేసుకున్నార‌నే విష‌యం తెలిసిందే.

కొత్త టాలెంట్ ను ఎంక‌రేజ్ చేస్తూ బ్యాన‌ర్

మిస్ వ‌ర‌ల్డ్ గా గెలిచిన త‌ర్వాత ప్రియాంక చోప్రా సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ త‌ర్వాత సొంతంగా బ్యాన‌ర్ ను నిర్మించి, అందులో కొత్త టాలెంట్ ను ఎంక‌రేజ్ చేస్తూ ఎన్నో సినిమాలు చేసి నిర్మాత‌గానూ స‌క్సెస్ అయ్యారు. ప్రియాంక రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ, తాను సొంతంగా నిర్మాణ సంస్థ ను మొద‌లుపెట్ట‌డానికి గ‌ల కార‌ణాన్ని వెల్ల‌డించారు.

ఆ టైమ్ లోనే బాలీవుడ్ లోని పరిస్థితులు అర్థ‌మ‌య్యాయి

2015లో ప్రియాంక చోప్రా ప‌ర్పుల్ పెబుల్ పిక్చ‌ర్స్ అనే బ్యాన‌ర్ ను స్థాపించారు. అయితే తాను ఆ బ్యాన‌ర్ ను మొద‌లుపెట్టడానికి ఆ రోజు బాలీవుడ్ లో ఉన్న ప‌రిస్థితులే కార‌ణ‌మ‌ని చెప్పారు. మిస్ వ‌ర‌ల్డ్ గెలిచాక త‌న‌కు వ‌రుస సినిమా ఆఫ‌ర్లొచ్చాయ‌ని, కానీ ఆ త‌ర్వాత రెండేళ్ల‌కు బాలీవుడ్ లోని సిట్యుయేష‌న్స్ అర్థ‌మ‌య్యాయ‌ని, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలో చుల‌క‌న‌గా చూస్తార‌నే విష‌యం త‌న‌కు అప్పుడే అర్థ‌మైంద‌ని ప్రియాంక అన్నారు.

కొత్త‌వాళ్లు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌తోనే..

ఇండ‌స్ట్రీలో ఎన్నో త‌రాలుగా ఉన్న వాళ్లే ఉన్న‌ప్పుడు కొత్త‌గా వ‌చ్చిన వాళ్ల‌కు ఛాన్సులు రావ‌డం అంత ఈజీ కాద‌ని తెలుసుకున్నాన‌ని, త‌న వ‌ర‌కు ఎంతో క‌ష్ట‌ప‌డి ఆఫ‌ర్లు సాధించుకున్నాన‌ని, కానీ అంద‌రూ త‌న‌లా ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌తోనే, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన వారిని ఎంక‌రేజ్ చేయ‌డానికి ఓ బ్యాన‌ర్ ను స్టార్ట్ చేశాన‌ని ప్రియాంక తెలిపారు. కాగా ప్రియాంక బ్యాన‌ర్ లో మొద‌టిగా 2016లో సినిమా వ‌చ్చింది. ఇక ప్రియాంక విష‌యానికొస్తే, నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్నాక ఆమె అమెరికాలోనే సెటిల్ అయ్యారు. ప్ర‌స్తుతం ప్రియాంక మ‌హేష్ బాబు- రాజ‌మౌళి సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.