Begin typing your search above and press return to search.

గ్లోబ‌ల్ బ్యూటీ హైద‌రాబాద్లో ప్లాట్ కొంటుందా?

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు టాలీవుడ్ సర్కిల్స్‌లో మారుమోగుతోంది. తాజాగా సమాచారం ప్రకారం అమ్మ‌డు హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ప్లాట్‌ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారుట‌.

By:  Srikanth Kontham   |   7 May 2026 11:31 PM IST
గ్లోబ‌ల్ బ్యూటీ హైద‌రాబాద్లో ప్లాట్ కొంటుందా?
X

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు టాలీవుడ్ సర్కిల్స్‌లో మారుమోగుతోంది. తాజాగా సమాచారం ప్రకారం అమ్మ‌డు హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ప్లాట్‌ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారుట‌. ఆప్లాట్ నివాసం కోసమే కాదు. పెరుగు తున్న టాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని సిటీలో స్థిరమైన ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలనే ఉద్దేశంతో ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది. గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు ఉన్న నటీమణి ఇక్కడ ఆస్తి కొంటున్నారంటే? అది తెలుగు సినిమా ప్రాముఖ్యతను చాటిచెబుతున్న‌ట్లే. ప్రస్తుతం ప్రియాంక చోప్రా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఓ తెలుగు సినిమాలో న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ సినిమా షూటింగ్ కోసం అమ్మ‌డు త‌రుచూ హైద‌రాబాద్ వ‌చ్చి వెళ్తోన్న సంగ‌తి తెలిసిందే. అవ‌స‌రం మేర హైద‌రాబాద్ లో స్టే చేస్తోంది లేదంటే సాయంత్రానికి షూట్ ముగించుకుని ముంబైకి వెళ్లిపోతుంది. ఈ నేప‌థ్యంలో ఇలా తిర‌గ‌డం కంటే? హోటళ్లలో ఉండటం కంటే ఇక్క‌డే ఓ సొంత ఇల్లు ఉంటే సౌకర్యంగా ఉంటుందన్న‌ది కొనుగోలుకు ఓ కార‌ణం కావొచ్చు. అంతేనే హైద‌రాబాద్ ఇప్పుడు అతి పెద్ద సిటీగా మారింది. అభివృదిలో ముంబై, బెంగుళూరు వంటి న‌గ‌రాల‌నే మించిపోతుంది.

అలాగే టాలీవుడ్ మార్కెట్ అతి పెద్ద‌గా అవ‌త‌రించింది. భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మించాలంటే? అది టాలీవుడ్ కి మాత్ర‌మే సాధ్యం అన్న‌ట్లు ఇప్ప‌టికే ప్రూవ్ అయింది. భ‌విష్య‌త్ లో మ‌రిన్ని భారీ బ‌డ్జెట్ సినిమాల నిర్మాణానికి రంగం సిద్ద‌మ‌వుతుంది. ఇలా టాలీవుడ్ ప్యూచ‌ర్ ని కూడా దృష్టిలో పెట్టుకుని పీసీ ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్ - హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న? ప్రియాంక టాలీవుడ్‌పై దృష్టి పెట్టడానికి మ‌రో ప్రధాన కారణం ఇక్కడి మార్కెట్ విస్తృతి. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లకు అందుతున్న పారితోషికం బాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోవడం లేదు.

కొన్ని సందర్భాల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల కంటే కూడా టాలీవుడ్ నిర్మాతలు ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారు. భారీ పారితోషికాలు, తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా వ‌స్తోన్న‌ క్రేజ్ ఇతర భాషల స్టార్లను ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు షూటింగ్ స్పాట్ మాత్రమే కాదు. రియల్ ఎస్టేట్ పరంగా కూడా సెలబ్రిటీల ఫేవరెట్ డెస్టినేషన్ అయింది. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ఇక్కడ స్థలాలను, ప్లాట్లను కొనుగోలు చేశారు. ఈ నేప‌థ్యంలో ప్రియాంక జూబ్లీహిల్స్ , గచ్చిబౌలి వంటి లగ్జరీ ఏరియాల్లో హై-ఎండ్ ప్రాపర్టీ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

పీసీకి ఇక్కడ ఇల్లు ఉంటే? భవిష్యత్తులో మరిన్ని సౌత్ ఇండియన్ ప్రాజెక్టులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరిలో హైద‌రాబాద్ లో జరిగిన షూటింగ్ ముగించుకుని వెళ్తూ పీసీ ఓ ఆసక్తిక‌ర కామెంట్ కూడా చేసారు. `హైదరాబాద్ తో ముడిప‌డిన ప్రేమ‌ని నా వెంట తీసుకెళ్తున్నాను` అంటూ ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ అప్పట్లో వైరల్ అయింది. ఆ అభిమానమే ఆమెను ఇక్కడ స్థిరమైన ఆస్తి కొనుగోలు చేసే దిశగా నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది.