వారణాసి : పృథ్వీరాజ్‌ను సర్‌ప్రైజ్ చేసిన మహేష్, ప్రియాంక
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్లగా జరుగుతున్నాయి.
By: Ramesh Palla | 9 Feb 2026 12:39 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్లగా జరుగుతున్నాయి. ఒక వైపు సినిమాకు సంబంధించిన మేకింగ్ జరుగుతూ ఉండగా, మరో వైపు ప్రమోషన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం నడుస్తోంది. ఇటీవల ప్రముఖ స్క్రీన్ రాంట్ ప్లస్ అనే మీడియా సంస్థకు వారణాసి టీం ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. రాజమౌళితో పాటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా పలు ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్వ్యూలో షేర్ చేసుకోవడం ద్వారా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆ ఇంటర్వ్యూ గురించి ప్రముఖుల నుంచి అన్ని వర్గాల వారు చర్చించుకుంటున్నారు.
కలరి విద్యపై మహేష్ బాబుకు పట్టు..
ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు కేరళ గురించి మాట్లాడుతూ తనకు కలరి విద్య పై ఉన్న పట్టు గురించి చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా కేరళలో అత్యధికంగా ఉండే కలరి విద్య ను నేర్చుకోవడం వల్ల తాను పలు ప్రయోజనాలు పొందినట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. కలరి అనేది బాడీ ని చాలా ఫిట్ గా ఉంచడంతో పాటు, శరీరంలోని పలు పార్ట్ స్ట్రాంగ్ గా మారుతాయని, అలాగే పలు రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండే వీలు ఉంటుందని అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఒక సినిమా కోసం తాను కలరి విద్య ను ఆరు నెలల పాటు నేర్చుకున్నట్లుగా మహేష్ బాబు చెప్పిన సమయంలో పక్కనే ఉన్న పృథ్వీ రాజ్ సుకుమారన్ షాక్ అయ్యాడు. మహేష్ బాబు కి కలరి విద్య పై ఉన్న పట్టు గురించి తెలిసి పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు అక్కడ ఉన్న వారు అంతా కూడా ఆశ్చర్యపోయారు. ఆయన అంత ఫిట్ గా ఉండటంకు కలరి ఒక కారణం అన్నట్లుగా చర్చ జరుగుతోంది.
ప్రియాంక చోప్రా అమ్మమ్మ కేరళ...
ఇక ప్రియాంక చోప్రా సైతం ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చర్చించింది. ముఖ్యంగా తన అమ్మమ్మ కేరళకు చెందినట్లుగా పేర్కొంది. తద్వార తనకూ కేరళతో సంబంధం ఉందని, కేరళ లో ఉండే కలరి విద్య గురించి తనకు కూడా మంచి అవగాహణ ఉన్నట్లుగా ప్రియాంక చోప్రా వెళ్లడించింది. తన అమ్మమ్మ కేరళకు చెందిన వ్యక్తి అని చెప్పడంతో పక్కన ఉన్న పృథ్వీ రాజ్ సుకుమారన్ షాక్ అయ్యి చూస్తూ ఉండి పోయాడు. అవునా అన్నట్లుగా షాకింగ్ గా ప్రశ్నించాడు. మొత్తానికి సినిమా యూనిట్ మొత్తం తనకు కేరళ తో ఉన్న అనుబంధం గురించి, అక్కడ ప్రత్యేకతల గురించి ఇంటర్వ్యూలో చక్కగా చెప్పడంతో ప్రస్తుతం ఆ వీడియో బైట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కేరళకు చెందిన సినీ ప్రేమికులు, రాజమౌళి, మహేష్ బాబు, పీసీ అభిమానులు వీడియోలను తెగ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
2027 లో ప్రేక్షకుల ముందుకు వారణాసి
ఇక మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ ఇండియాలో ఫుడ్ చాలా విభిన్నంగా ఉంటుందని అన్నాడు. ప్రాంతానికి ఒక రకంగా ఉండటం మనం చూస్తామని అన్నాడు. ఇండియాలో సినిమాలు ఎలా అయితే వివిధ రకాలుగా ఉన్నాయో అలాగే ఫుడ్ కూడా చాలా స్పెషల్‌గా విభిన్నంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు, అంతే కాకుండా తాను సీ ఫుడ్ ను ఎక్కువగా తింటాను అన్నట్లుగా పేర్కొన్నాడు. వారణాసి సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్, పోస్టర్స్ అంచనాలు పెంచింది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో విడుదల చేయడంలో భాగంగా ఇలా భారీ ప్రమోషన్ ను ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటి వరకు రాజమౌళి నుంచి వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుంది అని చాలా నమ్మకంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు నమ్ముతున్నారు.
