వారణాసి కోసం ముంబైకు గ్లోబల్ బ్యూటీ.. ఎందుకంటే?
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి అనే పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 11 Dec 2025 6:52 PM ISTగ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి అనే పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు, అమెరికాకు తిరుగుతున్న ప్రియాంక రీసెంట్ గా ది కపిల్ శర్మ షో సీజన్4 కోసం ముంబైకు వచ్చారు. కపిల్ శర్మ షో కు సంబంధించిన కొత్త సీజన్ డిసెంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో టెలికాస్ట్ కానుంది.
అయితే ఈ సీజన్4 ఎవరితో మొదలుకానుందనే ఆసక్తి ఇప్పటికే అందరిలోనూ నెలకొనగా, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుని చెప్తూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే చాలా మంది ఈ సీజన్ కు మొదటిగా వచ్చే గెస్ట్ ప్రియాంకనే అని మాట్లాడుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రియాంక తన సోషల్ మీడియాలో దానికి సంబంధించిన హింట్స్ ఇస్తూ వస్తున్నారు.
కపిల్ ను రెడీగా ఉండమని పోస్ట్
ప్రియాంక ముంబైలో దిగగానే కపిల్ ను ఆటపట్టిస్తూ ఫ్లైట్ లో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేస్తూ నువ్వు రెడీగా ఉండు అంటూ దానికి కపిల్ ను ట్యాగ్ చేశారు. ఆ తర్వాత ముంబై మేరీ జాన్ అనే క్యాప్షన్ తో మరో ట్యాక్సీ వీడియోను పోస్ట్ చేయగా, ఆ పోస్టుల్లో ప్రియాంక ఎగ్జైట్‌మెంట్ చాలా బాగా కనిపిస్తోంది. అయితే ప్రియాంక కపిల్ షోకు వెళ్లడానికి గల కారణం వారణాసి ని ప్రమోట్ చేయడానికే అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
ఇప్పటికే రెండుసార్లు కపిల్ షోకు వెళ్లిన రాజమౌళి
కాకపోతే ఈ షోలో ప్రియాంకతో పాటూ మహేష్ బాబు, రాజమౌళి కూడా కనిపిస్తారా లేదా అనే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఊహాగానాలు చేస్తున్నారు. గతంలో బాహుబలి కోసం ప్రభాస్ తో, ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి కపిల్ షోకు వెళ్లిన రాజమౌళి, ఇప్పుడు మరోసారి ప్రియాంకతో కలిసి మహేష్ మూవీ కోసం పాల్గొంటారా లేదా అనేది చూడాలి. మరి కపిల్ శర్మ షో సీజన్4 లో ఎలాంటి సర్‌ప్రైజులు రానున్నాయో చూడాలి.
