Begin typing your search above and press return to search.

ఏ త‌లుపు త‌ట్టాలో తెలియ‌ని వారి కోస‌మే ఆవిడ‌!

ప్రియాంక చోప్రా నేడు గ్లోబ‌ల్ స్థాయిలో పేరున్న‌ న‌టి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి స‌త్తా చాటిన న‌టి. అదే ప‌రిశ్ర‌మ‌లో స్థిర‌ప‌డి న‌టి.

By:  Srikanth Kontham   |   2 Dec 2025 6:00 AM IST
ఏ త‌లుపు త‌ట్టాలో తెలియ‌ని వారి కోస‌మే ఆవిడ‌!
X

ప్రియాంక చోప్రా నేడు గ్లోబ‌ల్ స్థాయిలో పేరున్న‌ న‌టి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి స‌త్తా చాటిన న‌టి. అదే ప‌రిశ్ర‌మ‌లో స్థిర‌ప‌డి న‌టి. తొలిసారి ఓ భార‌తీయ మ‌హిళ హాలీవుడ్ లో నిల‌దొక్కుకోవ‌డం అన్న‌ది ఇదే తొలిసారి. `క్వాంటికో` సిరీస్ స‌క్సెస్ త‌ర్వాత హాలీవుడ్ లో పీసీ జ‌ర్నీ ఎలా సాగుతుంది? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ స్థాయికి పీసీ అంత ఈజీగా చేర‌లేదు. బాలీవుడ్ లో కెరీర్ ఆరంభంలో ఎన్నో ఆటు పోటులు చూసింది. బాలీవుడ్ నుంచి ఎలాంటి స‌పోర్ట్ లేదు. సైనిక కుటుంబం నుంచి ముంబై కి న‌టిగా స‌క్సెస్ అవ్వాల‌ని వెళ్లింది.

త‌న‌లో ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే:

తొలి అవ‌కాశం కోసం చాలా క‌ష్ట‌ప‌డింది. వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ హిందీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న‌త శిఖ‌రానికి చేరింది. హిందీలో కొత్త‌గా పీసీ సాధించాల్సిందంటూ ఏమీ లేదు. దాదాపు స్టార్ హీరోలంద‌రి తో ప‌ని చేసింది. ఎన్నో జాన‌ర్ చిత్రాల్లో న‌టించింది. అందుకే ఇంగ్లీష్ న‌టీమ‌ణుల‌కు పోటీగా హాలీవుడ్ కి వెళ్లింది. అలాగే బాలీవుడ్ లో ప‌ర్పుల్ పెబుల్ పిక్చ‌ర్స్ అనే నిర్మాణ సంస్థ‌ను స్థాపించింది. అయితే ఈ సంస్థ స్థాప‌న వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? అన్న‌ది ఇంత వ‌ర‌కూ ఎక్క‌డా ఓపెన్ అవ్వ‌లేదు. తాజాగా ఓ మీట్ లో ఆ విష‌యాలు రివీల్ చేసింది.

కొత్త వారి కోస‌మే నిర్మాణ సంస్థ‌:

సమాజంలో మార్పు తెచ్చే, ప్రేక్షకులను ఆలోచింపజేసే, వారిని కదిలించే కథలను తెరకెక్కించాలన్నది తన ఆశయమన్నారు. అందుకోస‌మే 2015లో `పర్పుల్ పెబుల్ పిక్చర్స్` స్థాపించిన‌ట్లు తెలిపారు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా భాష‌తో సంబంధం లేకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌తిభావంతుల్ని వెలుగులోకి త‌సుకురావాల‌న్నది పీసీ ప్లాన్ గా చెప్పుకొచ్చింది. రచయితలు, దర్శకులు, నటీనటులను ప్రోత్సహించ‌డం కోస‌మే స్థాపించాన‌న్నారు. కొత్త‌గా సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చే వారు ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని, అవ‌స‌ర‌మైన గెడెన్స్ కూడా త‌న నిర్మాణ సంస్థ ఇస్తుంద‌న్నారు.

తెలిసింది గోరంత తెలియంది కొండంత‌:

అప్ప‌ట్లో త‌న‌కు మార్గ‌నిర్దేశం చేసేవారు లేక చాలా ఇబ్బందులు ప‌డ్డాన‌ని, ఎవ‌రూ అండ‌గా లేక‌పోవ‌డం చూసాన న్నారు. కొత్త వారికి అవ‌కాశాలు క‌ల్పించ‌డమే బ్యాన‌ర్ ఉద్దేశంగా పేర్కొన్నారు. `పానీ`, `వెంటిలేటర్`, `టు కిల్ ఎ టైగర్` వంటి చిత్రాల నిర్మాణం దానిలో భాగంగా చేసిన ఓ ప్ర‌య‌త్న‌మ‌న్నారు. ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని క‌థ‌లు ప్ర‌ప‌చంలో ఎన్నో ఉన్నాయ‌ని వాటిని సినిమా రూపంలో చెప్పాల్సి ఉంద‌న్నారు. అలాగే ప్రియాంక చోప్రా `వార‌ణాసి` సినిమాతో తెలుగులో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.