విడాకుల రూమర్లపై క్లారిటీ ఇచ్చిన గ్లోబల్ బ్యూటీ
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి సోషల్ మీడియాలో వస్తున్న డివోర్స్ రూమర్స్‌పై గట్టిగా స్పందించారు.
By: Sravani Lakshmi Srungarapu | 26 March 2026 6:15 PM ISTగ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి సోషల్ మీడియాలో వస్తున్న డివోర్స్ రూమర్స్‌పై గట్టిగా స్పందించారు. గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ఊహాగానాలపై అసహనం వ్యక్తం చేసిన ఆమె, తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని క్లియర్‌గా చెప్పేశారు. తనకి, తన భర్త నిక్ జోనాస్ మధ్య ఎలాంటి సమస్యలూ లేవని, తమ వివాహ బంధం చాలా బలంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
కావాలనే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు
మేము మా జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నామంటూ, బయటేం జరుగుతుందో అంతగా పట్టించుకోమని, కానీ ఎప్పటికప్పుడు డివోర్స్ రూమర్స్ రావడం మాత్రం అర్థం కావడం లేదని, ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా, కొందరు కావాలనే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ ప్రియాంక అసహనం వ్యక్తం చేశారు. వేర్వేరు దేశాలు, మతాలు, అలాగే తమ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ వంటి అంశాలను కారణాలుగా చూపిస్తూ రూమర్స్ క్రియేట్ చేయడం సరికాదని ఆమె అన్నారు.
పరిచయమైన ఆరు నెలలకే పెళ్లి
తమ ప్రేమ కథ కూడా చాలా ప్రత్యేకమని ప్రియాంక గుర్తుచేశారు. తమకు పరిచయమైన ఆరు నెలల్లోనే పెళ్లి చేసుకున్నామని, ఇప్పటికి ఎనిమిదేళ్లుగా తమ బంధం మరింత బలపడుతూ వచ్చిందని తెలిపారు. నిక్‌ను కలిసిన వెంటనే అతనే సరైన వ్యక్తి అని అనిపించిందని, అతనెంతో నిజాయితీపరుడని, అందుకే మరో ఆలోచన లేకుండా ముందడుగు వేశానని ఆమె చెప్పిన మాటలు వారి రిలేషన్‌లో ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
కూతురి ప్రైవసీ విషయంలో చాలా స్ట్రిక్ట్
ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే, తమ కూతురి ప్రైవసీ విషయంలో తానెంత సీరియస్‌గా ఉంటారో ప్రియాంక వివరించారు. పర్మిషన్ లేకుండా పిల్లల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని తాను అస్సలు ఇష్టపడనని, అందుకే స్పెషల్ గా సెక్యూరిటీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కూతురి ప్రైవసీ కాపాడటం తన బాధ్యతని, తమ అనుమతి లేకుండా ఎవరూ ఫోటోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్రభావంపై కూడా ప్రియాంక తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఫోటోలు లేదా పోస్టులు చూసి ఊహాగానాలు సృష్టించడం ఇప్పుడు ట్రెండ్ అయిందని, కానీ అవి వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపుతాయని ఆమె అన్నారు. నిజమైన విషయాలను అర్థం చేసుకోకుండా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం బాధాకరమని తెలిపారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి అనే పాన్ వరల్డ్ మూవీలో నటిస్తుండగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
