Begin typing your search above and press return to search.

శృతిమించితే తప్పదు శిక్ష.. ఆసక్తి పెంచుతున్న ప్రియాంక కొత్త పోస్ట్!

ఒకప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేసి.. ఆ తర్వాత హాలీవుడ్ లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది ప్రియాంక చోప్రా.

By:  Madhu Reddy   |   6 Aug 2025 6:20 PM IST
శృతిమించితే తప్పదు శిక్ష.. ఆసక్తి పెంచుతున్న ప్రియాంక కొత్త పోస్ట్!
X

ఒకప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేసి.. ఆ తర్వాత హాలీవుడ్ లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది ప్రియాంక చోప్రా. ఈమధ్య మళ్లీ ఇండియాలో కూడా సత్తా చాటడానికి సిద్ధమైంది.. అందులో భాగంగానే సౌత్ లో అందులోనూ తెలుగులో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తోంది. అదే ఎస్ఎస్ఎంబి 29. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ ఎస్ఎస్ఎంబి 29 మూవీలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. అలాగే ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో తన పార్ట్ లో కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమె.. ఇప్పుడు మరొకసారి ఇండియాలో అడుగు పెట్టింది. మిగిలిన షూటింగ్ కోసం ఇండియాలో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా.. తన కూతురితో ఇండియాకి చేరుకున్నట్టు ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది..

ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి ప్రియాంక చోప్రా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. అందులో భాగంగానే.. రీసెంట్ గా ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక మిస్టీరియస్ పోస్ట్ అందరిలో కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. మరి ఇంతకీ ప్రియాంక చోప్రా పెట్టిన ఆ పోస్టులో ఏముంది అనేది చూస్తే..

"నేను అందరిపై ప్రేమతోనే ఉంటాను. అందర్నీ అర్థం చేసుకుంటాను. కానీ నన్ను ఎవరైనా అగౌరవ పరిస్తే వారితో నా రిలేషన్ ని కట్ చేసుకుంటాను.. వారిని దూరం చేసుకోవడానికి రెండు సార్లు ఆలోచించను. అలాంటి వారిని దూరం పెట్టడంలో నాకు ఎలాంటి సమస్య లేదు.. శృతిమించితే శిక్ష తప్పదు " అంటూ పెట్టింది. అంతేకాకుండా ఆ నోట్ తో పాటు "లాల్.. ఇంకెవరైనా సంబంధం కలిగి ఉన్నారా" అనే క్యాప్షన్ కూడా జోడించింది.

అయితే ప్రియాంక చోప్రా పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు ఇదేంటి ప్రియాంక చోప్రా ఇలాంటి పోస్ట్ పెట్టింది. ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటోందా? భర్తతో సమస్యలా? లేకపోతే తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎవరితోనైనా సమస్యలు ఎదుర్కొంటోందా? అనే అనుమానం ఈ పోస్ట్ చూసిన చాలా మందిలో కలుగుతోంది. అయితే ప్రియాంక చోప్రా ఇంతటితో ఆగకుండా మరో పోస్ట్ కూడా పెట్టింది. అదేంటంటే.."

తిరుగుబోతు కంటే ఒక బిచ్చగాడు ఎంతో బెటర్" అన్నట్లుగా పెట్టింది. అయితే ప్రియాంక పెట్టిన ఈ పోస్టులన్నీ చూస్తూ ఉంటే మాత్రం ఆమె ఏదో విషయంలో గట్టిగానే హర్ట్ అయినట్టు అర్థం అవుతుంది. మరి ప్రియాంక చోప్రా పెట్టే పోస్టులు ఎవరిని ఉద్దేశించి పెడుతోంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రియాంక చోప్రా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన బాల్యంలో ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి కూడా బయట పెట్టింది.