SSMB 29 : ప్రియాంక చోప్రా లీక్ చేస్తుందా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ SSMB 29.
By: M Prashanth | 30 Aug 2025 3:21 PM ISTప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ SSMB 29. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆయనతోపాటు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే ఆ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తాయోనని అంతా వెయిట్ చేస్తున్నారు. కానీ మేకర్స్ ఎలాంటి లీక్స్ ఇవ్వడం లేదు. రీసెంట్ గా మూవీ టీమ్.. కెన్యా వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ నేషనల్ పార్క్ లో అద్భుతమైన వన్య ప్రాణుల మధ్య భారీ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారని సమాచారం.
గత నెలలో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. అయితే ఇప్పుడు కెన్యాలో షూటింగ్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వనప్పటికీ.. ప్రియాంక చోప్రా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అందరికీ క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా ఆమె వివిధ పిక్స్ ను షేర్ చేశారు.
అవి కాస్త వైరల్ గా మారాయి. ప్రియాంక తీసిన కొన్ని నేచర్ ఫోటోలు పోస్ట్ చేయగా.. అవి అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని గుర్తు పడుతూ ఓహ్ కెన్యాలో ఉన్నారా?, అవి నార్త్ ఆఫ్రికాలో తీసిన ఫొటోస్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో మహేష్ వైఫ్ నమ్రత కూడా ఆ పోస్ట్ కు రెస్పాండ్ అయ్యారు.
దీంతో అందరికీ ప్రస్తుతం SSMB 29 టీమ్ కెన్యాలో ఉన్నట్లు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి రాజమౌళి అంతా సీక్రెట్ గా కానిస్తున్నప్పటికీ.. ప్రియాంక చోప్రా పోస్టుల ద్వారా మూవీ మ్యాటర్స్ లీక్ అవుతున్నాయనే చెప్పాలి. ఆమె సినిమాలో నటిస్తున్నట్లు కూడా మేకర్స్ అనౌన్స్ చేయలేదు. కామెంట్ ద్వారానే లీక్ అయింది.
కాగా, SSMB 29 విషయానికొస్తే.. మహేష్, ప్రియాంకతోపాటు మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మాధవన్ సహా పలువురి పేర్లు వినిపించినప్పటికీ క్లారిటీ లేదు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా.. కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ పూర్తి కానుందని, 2027లో సినిమా రిలీజ్ కానుందని వినికిడి.
