Begin typing your search above and press return to search.

గ్లోబల్ బ్యూటీ హైదరాబాద్‌లో పూల్ డే.. ప్రియాంక చోప్రా సింప్లిసిటీకి ఫిదా..

ఈ సినిమా కోసం త‌ను ఎంతో శ్రమిస్తున్నా... తాజాగా లభించిన విరామ సమయంలో హైదరాబాద్‌లో తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు.

By:  Sivaji Kontham   |   8 April 2026 7:47 PM IST
గ్లోబల్ బ్యూటీ హైదరాబాద్‌లో పూల్ డే.. ప్రియాంక చోప్రా సింప్లిసిటీకి ఫిదా..
X

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం `వారణాసి` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం త‌ను ఎంతో శ్రమిస్తున్నా... తాజాగా లభించిన విరామ సమయంలో హైదరాబాద్‌లో తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు. ఈ క్రమంలో పీసీ సోషల్ మీడియాలో షేర్ చేసిన `పూల్ డే` ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. విదేశాల్లో స్థిరపడిన ఈ గ్లోబల్ బ్యూటీ మన భాగ్యనగరంలో ఇలా రిలాక్స్ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ ప్రత్యేకమైన పూల్ డే సెలబ్రేషన్స్‌లో ప్రియాంకతో పాటు భర్త, పాప్ సింగర్ నిక్ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీ కూడా పాల్గొన్నారు. షూటింగ్ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రియాంక ఈ ఫ్యామిలీ టైమ్‌ను ఇలా స్పెండ్ చేసారు. కేవలం గ్లామర్ ఫోటోలకే పరిమితం కాకుండా భర్త.. చిన్నారి మాల్తీతో కలిసి నీళ్లలో ఆడుకుంటున్న క్షణాలు ప్రేక్షకులకు ఒక అందమైన ఫ్యామిలీ వైబ్‌ను అందించాయి. ఈ ఫోటోలు ప్రియాంకలోని మాతృత్వాన్ని త‌న‌ వ్యక్తిగత జీవితంలోని ప్రశాంతతను ప్రతిబింబిస్తున్నాయి.

సాధారణంగా సెలబ్రిటీల ఫోటోలు అంటే భారీ సెట్టింగ్‌లు, మేకప్, కాస్ట్‌లీ డ్రెస్సులు ఉంటాయి. కానీ ఈ పూల్ డే ఫోటోల్లో ప్రియాంక చాలా సాదాసీదాగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా పూల్ పక్కన కూర్చుని మామిడి కాయలు తింటున్న ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఎంతటి గ్లోబల్ స్టార్ అయినా.. మన దేశీయ పండ్లను ఆస్వాధించడంలో ఉన్న మజాను పీసీ చూపించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ సింప్లిసిటీయే ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవ్వడానికి ప్రధాన కారణమైంది.

నెటిజన్లు ఈ ఫోటోలపై స్పందిస్తూ.... ఇది ఒక సాధార‌ణ జీవిత గ‌మ‌నానికి నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు. విజయం అంటే కేవలం కోట్లు సంపాదించడం లేదా ఆడంబరంగా బ్రతకడం మాత్రమే కాదు నచ్చిన వారితో ప్రశాంతంగా గడపడం కూడా అని ప్రియాంక నిరూపించారు. అత్యధిక ప్రొడక్షన్ విలువలతో తీసిన పర్ఫెక్ట్ ఫోటోల కంటే.. ఇలాంటి సహజమైన మూవ్ మెంట్స్ కే నేటి తరం ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ ట్రెండ్ స్పష్టం చేస్తోంది. ఇదొక కేవలం ఫోటో షూట్ లా కాకుండా పీసీ జీవనశైలిని ప్రతిబింబించే ఒక కథలా అనిపిస్తోంది.

వృత్తిపరమైన బాధ్యతలు.. వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను ప్రియాంక ఎలా పాటిస్తున్నారో ఈ పూల్ డే ఫోటోలు ఒక ప్రేరణగా నిలుస్తున్నాయి. నిరంతరం షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీ కల్చర్‌లో రియాలిటీకే ఎక్కువ విలువ ఉంటుందని పీసీ ఫోటోగ్రాఫ్‌ మరోసారి ప్రూవైంది. హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఈ మధుర క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారాయి. వార‌ణాసి చిత్రంలో పీసీ పాత్ర ఎలా ఉంటుందో చూడాల‌నే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.