హీరో కంటే హీరోయిన్ ఖర్చే ఎక్కువ.. జక్కన్న కొత్త లెక్క!
'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి, మహేష్ బాబుతో చేస్తున్న సినిమా SSMB29పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: M Prashanth | 7 Nov 2025 12:00 PM IST'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి, మహేష్ బాబుతో చేస్తున్న సినిమా SSMB29పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెయ్యి కోట్లు బడ్జెట్ పెట్టినా, ప్రతి పైసా సరిగ్గా ఖర్చు పెట్టడంలో జక్కన్న తర్వాతే ఎవరైనా. ఆయన ప్రతీ ఫ్రేమ్‌ను ఎంతలా చెక్కుతారో, ప్రొడక్షన్ ఖర్చును కూడా అంతే కంట్రోల్‌లో ఉంచుతారన్న పేరుంది. కానీ, ఈసారి ఆ లెక్కలు తప్పుతున్నాయా అనే డౌట్ వస్తోంది.
ఈ సినిమాను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లేందుకు రాజమౌళి గట్టి ప్లానే వేశారు. అందుకే, ఈ ప్రాజెక్ట్‌లోకి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను తీసుకున్నారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఆమె రాకతో సినిమాకు గ్లోబల్ అప్పీల్ వస్తున్న మాట వాస్తవమే అయినా, నిర్మాత జేబుకు మాత్రం ఊహించని భారం పడుతోందట.
అసలు టాక్ ఏంటంటే, ఈ సినిమా కోసం ప్రియాంకకు అవుతున్న ఖర్చు.. సాక్షాత్తూ మెయిన్ హీరో మహేష్ బాబు ఇతర ఖర్చుల కంటే ఎక్కువగా ఉంటోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మహేష్ ఎలాగూ ఉండేది హైదరాబాద్ లోన్ కాబట్టి ఇంట్లో ఉండడం, ప్రయాణాలు సొంత కార్లలోనే కావడంతో అతని ఖర్చు పెద్ద ఎక్కువేమీ కాదు. కానీ ప్రియాంక ఫీజు సంగతి పక్కనపెడితే, ఆమె ప్రయాణాల ఖర్చే తడిసి మోపెడవుతోందట.
ప్రస్తుతం యూఎస్‌లో ఉంటున్న ప్రియాంక, చిన్న మీటింగ్ అయినా, వర్క్‌షాప్ అయినా.. ఇండియాకు ప్రత్యేకంగా ఫస్ట్ క్లాస్‌లో వస్తున్నారట. ఆమె రానుపోను విమాన ఖర్చులే లక్షల్లో ఉంటున్నాయి. దీనికి తోడు ఆమె వసతి, లగ్జరీ సౌకర్యాలు, సిబ్బంది ఖర్చులు అదనం. ఆమె నాలుగైదు సార్లు వాస్తేనే లెక్క కోటి దాటుతున్నట్లు టాక్. బడ్జెట్ విషయంలో ఎంతో కఠినంగా ఉండే రాజమౌళి, ప్రియాంక విషయంలో మాత్రం ఆ లిమిట్స్ పెట్టుకోలేదని స్పష్టంగా అర్థమవుతోంది.
అయితే, రాజమౌళి అంతలా ఖర్చుకు వెనకాడకపోవడానికి బలమైన కారణమే ఉంది. ఇది కేవలం తెలుగు సినిమా కాదు, గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న ప్రాజెక్ట్. మహేష్ బాబుకు పాన్ ఇండియా అప్పీల్ ఉన్నా, ప్రియాంకకు ఉన్న అంతర్జాతీయ బ్రాండ్ వ్యాల్యూ, ఆమె ఫేస్.. సినిమాకు వెలకట్టలేని మైలేజీని తెచ్చిపెడతాయి.
అందుకే, ఆమెను కేవలం నటిగా కాకుండా, ఒక గ్లోబల్ అంబాసిడర్‌గా భావించి జక్కన్న ఈ పెట్టుబడి పెడుతున్నారు. 'వెయ్యి కోట్ల' బడ్జెట్‌లో ఈ ఖర్చు పెద్ద లెక్క కాకపోవచ్చు, కానీ.. సినిమా విడుదలకు ముందే ప్రియాంక తన బ్రాండ్ వాల్యూతో ఈ బడ్జెట్‌ను తిరిగి సంపాదించి పెడుతుందన్నది రాజమౌళి నమ్మకం.
