Begin typing your search above and press return to search.

వారణాసి బడ్జెట్ సంగతేంటి? ప్రియాంక అలా అనిందేంటి?

దీంతో ఆమె సగం నా బ్యాంకు ఖాతాలోకి వెళ్లిందనేది మీ ఉద్దేశమా ఏంటి? అంటూ ఫన్ చేశారు. ప్రస్తుతం వీరి కన్వర్జేషన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  M Prashanth   |   21 Dec 2025 8:00 PM IST
వారణాసి బడ్జెట్ సంగతేంటి? ప్రియాంక అలా అనిందేంటి?
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వారణాసి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. కొన్ని నెలలుగా చిత్రీకరణను జెట్ స్పీడ్ లో నిర్వహిస్తూనే ఉన్నారు మేకర్స్.

అయితే వారణాసి మూవీ.. రూ.1300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున వ్యయంతో సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ విషయాన్ని మూవీలో ముఖ్య పాత్రలో నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వద్ద తాజాగా ప్రస్తావించగా.. ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రియాంక చోప్రా.. రీసెంట్ గా ఫేమస్ ది కపిల్ శర్మ షోకు అటెండ్ అయ్యారు. ఆ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కపిల్ శర్మ.. ప్రియాంక వద్ద వారణాసి సినిమా బడ్జెట్ విషయాన్ని ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టు లో మీరు (ప్రియాంక చోప్రా) జాయిన్‌ అయిన తర్వాతే బడ్జెట్‌ పెరిగిందట కదా.. నిజమేనా? అంటూ కపిల్‌ ఆమెను సరదాగా ప్రశ్నించారు.

దీంతో ఆమె సగం నా బ్యాంకు ఖాతాలోకి వెళ్లిందనేది మీ ఉద్దేశమా ఏంటి? అంటూ ఫన్ చేశారు. ప్రస్తుతం వీరి కన్వర్జేషన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే భారీ బడ్జెట్ తో మూవీ రూపొందుతున్నట్లు ప్రియాంక పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లేనని నెటిజన్లు, సినీ ప్రియులు, ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

కాగా.. సినిమాలో ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో ప్రియాంక చీరతో కనిపించారు. చేతిలో తుపాకీతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ, బుల్లెట్ల వర్షం కురిపిస్తూ.. ఏడారి, కొండల ప్రాంతంలో సాహసం చేస్తూ కనిపించారు.

అదే సమయంలో సినిమాలో మహేష్ రుద్ర రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాల్లో రాముడిగా సందడి చేయనున్నారు. మందాకినిగా ప్రియాంక నటిస్తుండగా.. కుంభ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ.. భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు.

ఇక రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో.. సినిమాలో ఏ అంశాలు ఉండనున్నాయో అందరికీ క్లారిటీ వచ్చేసింది. వారణాసి వరల్డ్ చూసి అంతా ఫిదా అయిపోయారు. ఇక 2026 చివర్లో షూటింగ్ పూర్తి అవ్వనున్నట్లు తెలుస్తోంది. 2027 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 120 దేశాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.