Begin typing your search above and press return to search.

నేను మహిళగా మారిన రోజు అది: ప్రియాంక చోప్రా

తాజా ఇంట‌ర్వ్యూలో పీసీ తన‌ను తాను మ‌హిళ‌గా ఆవిష్క‌రించుకున్న సంద‌ర్భం గురించి మాట్లాడింది. ప్రియాంక చోప్రా త‌న పారితోషికం అందుకున్న త‌ర్వాత‌, మొద‌ట‌గా రెండు క్యారెట్ల వ‌జ్రాన్ని కొనుగోలు చేసాన‌ని తెలిపింది.

By:  Sivaji Kontham   |   22 Oct 2025 7:00 AM IST
నేను మహిళగా మారిన రోజు అది: ప్రియాంక చోప్రా
X

గ్లోబ‌ల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఏం చేసినా అది ప్ర‌త్యేకంగా ఉంటుంది. భ‌ర్త, పిల్ల‌లు, కుటుంబంతో విదేశీ బీచ్ ల‌లో చిలౌట్ చేస్తున్నా లేదా రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో క్యాట్ వాక్ లు చేసినా, న్యూయార్క్ వీధుల్లో అప్ర‌య‌త్నంగా షికార్లు చేసినా.. ప్ర‌తిసారీ సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టుగా త‌న లుక్‌తో మైమ‌రిపిస్తుంది.

అంత‌ర్జాతీయ రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో పీసీ ఫ్యాష‌న్ సెన్స్ ప‌రంగా విఫ‌లం కాలేదు. పీసీ లుక్ సెన్స్, ధ‌రించిన ఆభ‌ర‌ణాల గురించి విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతుంది. ముఖ్యంగా ప్రియాంక చోప్రా ఆభర‌ణాల ఎంపిక‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటాయి. లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ బ‌ల్గారి గ్లోబల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రా ఆభరణాలతో వ్యక్తిగత సంబంధం గురించి తాజాగా మాట్లాడింది.

తాజా ఇంట‌ర్వ్యూలో పీసీ తన‌ను తాను మ‌హిళ‌గా ఆవిష్క‌రించుకున్న సంద‌ర్భం గురించి మాట్లాడింది. ప్రియాంక చోప్రా త‌న పారితోషికం అందుకున్న త‌ర్వాత‌, మొద‌ట‌గా రెండు క్యారెట్ల వ‌జ్రాన్ని కొనుగోలు చేసాన‌ని తెలిపింది. అది కూడా త‌న మొద‌టి సినిమాకి అందిన పారితోషికాన్ని దాచుకుని ఖ‌ర్చు చేసింద‌ట‌. నా వ‌జ్రాల‌ను నేను కొనుగోలు చేయ‌డం అంటే నేను ఒక మ‌హిళ‌గా మారిన‌ట్టేన‌ని నా త‌ల్లి (మ‌ధు చోప్రా) చెప్పార‌ని ప్రియాంక చోప్రా తెలిపింది. ``నేను కొనుగోలు చేసిన మొదటి ముఖ్యమైన ఆభరణం రెండు క్యారెట్ల వజ్రం. ఇది నా కెరీర్ ఆరంభంలో .. నా మొద‌టి సంత‌కం నుంచి దాచుకున్న డ‌బ్బు.. అని వెల్ల‌డించింది.

రెడ్ కార్పెట్ ఈవెంట్స్, సినిమా ప్రీమియర్ల కోసం ఆభరణాల ఎంపిక‌కు వేరే ఏదైనా విధానం ఉందా? అని ప్ర‌శ్నిస్తే... ధ‌రించాల‌నుకున్న ఆభ‌ర‌ణం ఎలాంటిదో ఎంపిక చేసుకున్న‌ దుస్తులు నిర్ణ‌యిస్తాయ‌ని వెల్ల‌డించింది. 2019 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తెల్లటి టల్లే గౌనుతో అద్భుతమైన చోపార్డ్ డైమండ్ నెక్లెస్, చెవిపోగులను ధ‌రించింది. అది ఆ సంవత్సరం అత్యంత చర్చనీయాంశమైన లుక్స్‌లో ఒకటిగా మారింది. 2017 మెట్ గాలా ఈవెంట్ కోసం రాల్ఫ్ లారెన్ ట్రెంచ్ గౌను ధ‌రించింది. 2023 మెట్ గాలాలో అరుదైన 11.16-క్యారెట్ పియర్-ఆకారపు నీలిరంగు వజ్రం, లగున బ్లూను కలిగి ఉన్న అద్భుతమైన బ‌ల్గారి నెక్లెస్ ల‌ను ధ‌రించింది. ప్రియాంక ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ ని అనుక‌రించ‌డంలో సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన ఫ్యాష‌నిస్టా. అందాల రాణిగా యువ‌త‌రం మ‌న‌సుల్లో నిలిచి ఉండ‌టానికి ఇది కూడా ఒక ప్ర‌ధాన కార‌ణం.