ఘోస్ట్ ప్రిన్సెస్ ఎవరో తెలుసా? ప్రియానిక్ హ్యాలోవీన్ సందడి!
తాజాగా ఈ గ్లోబల్ బ్యూటీ షేర్ చేసిన హ్యాలోవీన్ వేడుకల ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
By: Sivaji Kontham | 1 Nov 2026 1:29 PM ISTమనిషి లైఫ్ స్పాన్ చాలా చిన్నది. ఇలాంటి చిన్న జీవితాన్ని వీలున్నంతగా ఆస్వాధించడం ముఖ్యం. నిరంతరం ఫ్యామిలీ లైఫ్‌ను సెలబ్రేట్ చేసుకోవడం అనేది కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి ఒక అందమైన జంటగా ప్రియానిక్ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ జంట ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలిచింది. పెళ్లయిన ప్రారంభంలోనే తమ వివాహ బంధంపై ఎన్నో రూమర్లు పుట్టుకొచ్చినా.. అవన్నీ పటాపంచలు చేస్తూ కాలానికి ఎదురొడ్డి ఈ జంట నిలిచింది. శత్రువుల దుష్ప్రచారాలకు అతీతంగా ఆదర్శవంతమైన కుటుంబ జీవనానికి పరమార్ధాన్ని చెబుతోంది. కుమార్తె మాల్తీ మేరీ ప్రవేశంతో ఈ జంట మరింత పకడ్భంధీగా ప్రతిదీ ప్లాన్ చేస్తోంది. మాల్తీతో కలిసి ఈ జోడీ చేసుకునే ప్రతీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటాయి.
తాజాగా ఈ గ్లోబల్ బ్యూటీ షేర్ చేసిన హ్యాలోవీన్ వేడుకల ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లాస్ ఏంజిల్స్‌లోని తమ నివాసంలో భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీలతో కలిసి హ్యాలోవీన్ పండుగను ప్రియాంక ఎంతో వైవిధ్యంగా జరుపుకున్నారు. ఈ వేడుకల ఫోటోలను షేర్ చేస్తూ.. ``ఒక కౌబాయ్.. ఓ ఘోస్ట్ ప్రిన్సెస్.. కింగ్ కైలీ.. అందరూ కలిసి ట్రిక్ ఆర్ ట్రీట్ కి వెళ్లారు. హ్యాలోవీన్ జరుపుకుంటున్న అందరికీ శుభాకాం
క్షలు`` అంటూ ప్రియాంక సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. పశ్చిమ దేశాల హ్యాలోవీన్‌తో పాటు తమ ఇంట్లో భారతీయ సాంప్రదాయం ప్రకారం చేసుకుంటున్న దీపావళి డెకరేషన్‌ను కూడా చూపిస్తూ #diwaloween అనే ప్రత్యేక హాష్‌ట్యాగ్‌ను జత చేశారు.
ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచినవి వారి కాస్ట్యూమ్స్. నిక్ జోనాస్ `కౌబాయ్` లుక్‌లో దర్శనమివ్వగా.. చిన్నారి మాల్తీ మేరీ `ఘోస్ట్ ప్రిన్సెస్` గెటప్‌లో అమాయకంగా అలరించింది. ప్రియాంక చోప్రా `కింగ్ కైలీ` అవతారంలో మెరిసారు. ఒకవైపు హ్యాలోవీన్ గెటప్స్, మరోవైపు బ్యాక్‌గ్రౌండ్‌లో దీపావళి కాంతుల డెకరేషన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటంతో ఎన్ఆర్ఐ సంస్కృతిని.. విదేశాల్లోనూ భారతీయ పండుగ వాతావరణాన్ని వారు కొనసాగిస్తున్న తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హ్యాలోవీన్, దీపావళి ఒకే సమయంలో రావడంతో అభిమానులు ఈ వేడుకను `దివాలోవీన్` అని కొనియాడుతూ ట్రెండ్ చేస్తున్నారు.
ఇక హాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో నిరంతరం బిజీగా ఉండే ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. 2026లో పీసీ నటించిన గ్లోబల్ యాక్షన్ థ్రిల్లర్ `ది బ్లఫ్` అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణ పొందింది. దీనితో పాటు ఇల్యా నైషుల్లర్ దర్శకత్వంలో జాన్ సీనాతో కలిసి నటించిన భారీ హాలీవుడ్ ప్రాజెక్ట్ `హెడ్స్ ఆఫ్ స్టేట్`లో పీసీ నటనకు మంచి పేరొచ్చింది. గ్లోబల్ స్థాయిలో తనదైన స్టంట్లతో, నటనతో ప్రియాంక హాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
వీటన్నింటినీ మించి టాలీవుడ్ జానపద-అడ్వెంచర్ ప్రాజెక్ట్ `వారణాసి` ప్రియాంక సౌత్ కెరీర్‌కే కాకుండా గ్లోబల్ ఇమేజ్‌కి బిగ్గెస్ట్ `గేమ్ ఛేంజర్` కాబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ చిత్రంలో ప్రియాంక చోప్రా మందాకిని అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. 2027 ఏప్రిల్‌లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ విజువల్ వండర్ భారతీయ చిత్రసీమ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. రాజమౌళి విజన్, మహేష్ బాబు స్టార్‌డమ్‌లతో పాటు ప్రియాంక అంతర్జాతీయ గుర్తింపు ఈ సినిమాకి తోడవ్వడం స్థాయిని అమాంతం పెంచేసింది. భారతీయ సినిమా ప్రమాణాలను మార్చివేసే సత్తా ఉన్న ఈ చిత్రం ప్రియాంక చోప్రా కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
