Begin typing your search above and press return to search.

ముంబై ఈవెంట్లో మెరిసిన గ్లోబల్ స్టార్.. డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్!

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఈవెంట్ లో సందడి చేసిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. తాను ధరించిన డ్రెస్ తో అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా ఆ డ్రెస్ ఖరీదు తెలిసి నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు.

By:  Madhu Reddy   |   2 Oct 2025 5:24 PM IST
ముంబై ఈవెంట్లో మెరిసిన గ్లోబల్ స్టార్.. డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్!
X

సినిమా సెలబ్రిటీలు లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు.. రియల్ ఎస్టేట్లో లేదా ఇతర వ్యాపార రంగాలలో పెట్టుబడులుగా పెడుతూ భారీ ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. అలా వచ్చిన డబ్బులో ఖరీదైన వస్తువులు, కార్లు , ఫ్లాట్లు, చేతి గడియారాలు, ఉంగరాలు ఇలా తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తారు. మరి కొంతమంది లక్షలు కాదు.. కోట్ల రూపాయల విలువచేసే ప్రత్యేకమైన దుస్తులను ధరించి వార్తల్లో నిలుస్తూ ఉంటారు. పైగా మన సెలబ్రిటీలు అప్పుడప్పుడు ప్రత్యేక సందర్భాలలో ధరించే దుస్తుల ఖరీదు తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.

బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ తో సందడి చేసిన ప్రియాంక..

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఈవెంట్ లో సందడి చేసిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. తాను ధరించిన డ్రెస్ తో అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా ఆ డ్రెస్ ఖరీదు తెలిసి నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. మరి ప్రియాంక చోప్రా ధరించిన ఆ డ్రస్ ఏంటి? దాని ఖరీదు ఎంత? ఆమె ఏ ఈవెంట్ కోసం ముంబైకి వచ్చింది? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఇండియాకి వచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే సెప్టెంబర్ 30న ముంబైలో జరిగిన దుర్గా పూజ పండల్ లో కనిపించిన ఈమె తాజాగా అదే ముంబై వేదికగా బ్వ్లగారి సెర్పెంటి ఇన్ఫినిటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. 43 ఏళ్ల వయసులో ఈమె తన ఫ్యాషన్ సెన్స్ తో పాటు తన బాడీ ఫిట్నెస్ తో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

డ్రెస్ ప్రత్యేకతలివే..

తాజాగా ఈవెంట్ లో పాల్గొన్న ప్రియాంక చోప్రా మెటాలిక్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన అద్భుతమైన బుర్గుండి మిడి డ్రెస్ ను ధరించింది.. మెటాలిక్ వైన్ కలర్ లో ఉన్న ఈ డ్రెస్ లో ప్లంగింగ్ U నెక్ లైన్.. సొగసైన బాడీ కాన్ సిల్హౌట్ ఈమెను మరింత హైలెట్గా నిలిచేలా చేశాయి. ముఖ్యంగా ఈ డ్రెస్ లో పర్ఫెక్ట్ అందాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.

ప్రియాంక ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంతంటే?

ఇకపోతే తాజాగా ప్రియాంక చోప్రా ధరించిన ఈ డ్రెస్ ఖరీదు అక్షరాల రూ.1.67 లక్షలు. దీని ఖరీదు తెలిసి అభిమానుల సైతం నోరెళ్ళ పెడుతున్నారు. ఏది ఏమైనా గ్లోబల్ స్టార్ తన రేంజ్ను నిరూపించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రియాంక చోప్రా ఇలాంటి ఖరీదైన దుస్తులు ధరించడం ఇదే మొదటిసారి కాదు.. ఎప్పటికప్పుడు పలు ఈవెంట్స్ లో పాల్గొంటూ తన దుస్తులతో, జువెలరీ ఐటమ్స్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల తన సోదరుడు నిశ్చితార్థ వేడుకలో సుమారుగా 12 కోట్ల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్ ధరించి అందరిని ఆశ్చర్యపరిచింది.

ప్రియాంక చోప్రా సినిమాలు..

ప్రియాంక చోప్రా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్ ఎస్ ఎం బి 29 మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.