Begin typing your search above and press return to search.

ఆస్కార్ విన్న‌ర్ చిత్రంలో ప్రియాంక చోప్రా!

ఇప్పటికే అనేక హాలీవుడ్ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన పీసీ తాజాగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

By:  Srikanth Kontham   |   7 Aug 2026 1:10 PM IST
ఆస్కార్ విన్న‌ర్ చిత్రంలో ప్రియాంక చోప్రా!
X

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ సినీ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక హాలీవుడ్ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన పీసీ తాజాగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. నిమ్రోడ్ అంతల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'బ్లూఫ్లై' చిత్రంలో ప్రధాన పాత్రకు ఎంపిక‌య్యారు. ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డు గ్రహీత.. ప్రముఖ నటుడు రస్సెల్ క్రోతో కలిసి పీసీ స్క్రీన్ పంచుకోవ‌డం విశేషం. ఈ చిత్ర కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంది. కాంగో అడవుల నేపథ్యంలో సాగే కథ ఒక యుఎన్ ట్రాన్స్‌లేటర్ చుట్టూ తిరుగుతుంది.

విమానం కూలిపోయిన ప్రదేశాన్ని కనుగొనే బ్లాక్-ఆప్స్ మిషన్‌లో పీసీ భాగస్వామి అవుతుంది. ఆ ప్రయాణంలో ఎదురయ్యే ఊహించని మలుపులు, మిలీషియా దళాల మధ్య సాగే పోరాటాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలవనున్నాయి. ఒక సాహసోపేతమైన ప్రయాణం ఎలా ప్రమాదకరంగా మారుతుందనేది సినిమా కథాంశం.

ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వార్తను పంచుకోగా అభిమానులు .. తోటి సినీ ప్రముఖుల నుండి భారీ స్పందన లభించింది. ముఖ్యంగా పీసీ భర్త గాయకుడు నిక్ జోనాస్ ప్రియాంక కొత్త ప్రాజెక్ట్‌ను చూసి ఉత్సాహంగా స్పందించారు.

నెటిజన్లు సైతం ప్రియాంక మరో అద్భుతమైన ప్రాజెక్ట్‌తో సిద్ధమవుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం కోసం మైఖేల్ జెఫెర్సన్, డేవిడ్ ఫ్రిగేరియో, డెబోరా గ్లోవర్ , ఆరియాన్ ఫ్రేజర్ వంటి వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'బ్లూఫ్లై' ఒక హృదయ స్పందనను పెంచే వినోదాన్ని అందిస్తుందని సంక్లిష్టమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని నిర్మాత ఆరియాన్ ఫ్రేజర్ ధీమా వ్య‌క్తం చేసారు.

హాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు భారతీయ సినీ ప్రేక్షకుల కోసం ప్రియాంక చోప్రా సిద్ధమవుతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి'. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ఎనిమిదేళ్ల విరామం తర్వాత పీసీ మళ్ళీ ఇండియన్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. ఇలా ఒకవైపు గ్లోబల్ స్థాయి యాక్షన్ థ్రిల్లర్.. మరోవైపు రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడితో భారీ పీరియాడిక్ డ్రామా. ఇలా రెండు విభిన్న ప్రపంచాలను ప్రియాంక చోప్రా సమతుల్యం చేసుకుంటున్న తీరు ప్రశంసనీయం. అమ్మ‌డు ఎంచుకుంటున్న కథలు గ్లోబల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా భారతీయ నటిగా పీసీ కీర్తిని మరింత పెంచుతున్నాయి. 'బ్లూఫ్లై' , 'వారణాసి' చిత్రాలు అమ్మ‌డి కెరీర్‌లో మైలురాళ్లుగా నిలవడం ఖాయ‌మ నిట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.