Begin typing your search above and press return to search.

ప్రియాంక చోప్రా బ్యాక్ లెస్ లుక్ సెన్సేష‌న్స్

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం `ది బ్లఫ్` సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాషన్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.

By:  Sivaji Kontham   |   23 Feb 2026 12:03 AM IST
ప్రియాంక చోప్రా బ్యాక్ లెస్ లుక్ సెన్సేష‌న్స్
X

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం `ది బ్లఫ్` సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాషన్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ముఖ్యంగా పీసీ తాజా బ్యాక్‌లెస్ లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. నెటిజన్లు ఈ అందాన్ని చూసి `పీసీ పరేషాన్ చేస్తోంది` అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





ఈ ఫోటోషూట్ సినిమా క‌థ‌ను ఎలివేట్ చేసే థీమ్ తో . క‌రీబియ‌న్ దొంగ లుక్ తో ఒక ప్ర‌య‌త్నం. ప్రియాంక తన ప్రమోషన్స్ రెండో రోజున వైన్ కలర్ డ్రెస్సులో మెరిసిపోయింది. ఈ డ్రెస్ డిజైన్ పీసీ వీపందాన్ని ఎలివేట్ చేస్తోంది. దీనితో పాటు పైరేట్ కోర్ గ్లామర్‌ను జోడించి ఒక డిఫరెంట్ లుక్‌ను ఆవిష్కరించింది.





ప్రెస్ టూర్ పేరుతో పీసీ ఈ కొత్త లుక్ ని సెన్సిబుల్ గా ప్ర‌ద‌ర్శించింది. త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో కేవలం సినిమా గురించి మాట్లాడటమే కాదు.. దానిని ఒక ఫ్యాషన్ రన్ వేలా మార్చేయగలనని పీసీ మరోసారి నిరూపించింది.





`ది బ్లఫ్` విశేషాలు..

ది బ్ల‌ఫ్ సినిమా క‌థాంశం ఆద్యంతం ఆస‌క్తిక‌రం. 19వ శతాబ్దపు కరీబియన్ దీవుల నేపథ్యంలో సాగే ఒక పైరేట్ (సముద్రపు దొంగల) యాక్షన్ డ్రామా. ఇందులో ప్రియాంక ఒక మాజీ సముద్రపు దొంగగా, తన కుటుంబాన్ని కాపాడుకునే ధైర్యవంతురాలైన మహిళగా కనిపిస్తుంది. అందుకే పీసీ ప్రమోషన్స్‌లో కూడా ఆ `పైరేట్` లుక్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఇప్ప‌టికే ప్రియాంక చోప్రా లుక్ ని, అలాగే ట్రైల‌ర్ లో త‌న పాత్ర‌ను చూసి ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ చిత్రాన్ని అవెంజ‌ర్స్ ఫేమ్ రూస్సో బ్ర‌ద‌ర్స్ ఏజిబివో ఫిలింస్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా దీనికి స‌హ‌నిర్మాత‌గా ఉన్నారు.





ప్రియాంక షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి నెటిజన్లు `బ్రేకింగ్ నెక్స్` (మెడలు తిప్పుకుని చూసేంత అందం) అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 43 ఏళ్ల వ‌య‌సులో ఈ ఫిట్‌నెస్, స్టైల్ విషయంలో నేటి తరం హీరోయిన్లకు పీసీ గట్టి పోటీనిస్తోంది.





హాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రియాంక, అటు గ్లామర్ పరంగా ఇటు యాక్టింగ్ పరంగా గ్లోబల్ స్థాయిలో తన ముద్ర వేస్తోంది. `ది బ్లఫ్` సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో విడుదల కానుంది. త‌దుప‌రి రాజ‌మౌళి- మ‌హేష్ ల‌తో వార‌ణాసి చిత్రీక‌ర‌ణ‌తోను బిజీ గా గ‌డుపుతున్న పీసీ త‌దుప‌రి డాన్ 3లో కూడా క‌నిపించ‌నుంది.