Begin typing your search above and press return to search.

ప్రియాంక చోప్రా చెప్పిన 5 పేరెంటింగ్ సూత్రాలు!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జోడీ నిజ జీవితంలోనూ తమ‌దైన ముద్ర వేస్తున్నారు. కుమార్తె మాల్తీ మేరీ పుట్టిన తర్వాత ఒక తల్లిగా ఆమె అనుసరిస్తున్న పద్ధతులు నేటి ఆధునిక తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   24 March 2026 11:39 PM IST
ప్రియాంక చోప్రా చెప్పిన 5 పేరెంటింగ్ సూత్రాలు!
X

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జోడీ నిజ జీవితంలోనూ తమ‌దైన ముద్ర వేస్తున్నారు. కుమార్తె మాల్తీ మేరీ పుట్టిన తర్వాత ఒక తల్లిగా ఆమె అనుసరిస్తున్న పద్ధతులు నేటి ఆధునిక తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక పంచుకున్న ఐదు పేరెంటింగ్ సూత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిల్లల పెంపకంలో క్రమశిక్షణతో పాటు ప్రేమ, గౌరవం ఎంత ముఖ్యమో ఆమె తన మాటల ద్వారా వివరించారు. పిల్లలను స్వతంత్రంగా పెంచడం. చిన్నప్పటి నుంచే వారు తమ సొంత నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిం చాలన్నారు.

ఆత్మవిశ్వాసం అనేది కేవలం పొగడ్తల ద్వారా రాదన్నారు. వారు చేసే పనుల్లో వారికి స్వేచ్ఛని చ్చినప్పుడే అది పెరుగుతుందని ప్రియాంక నమ్ముతారు. తప్పులు చేసినా ఫర్వాలేదని వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ ప్రయత్నించే ధైర్యాన్ని పిల్లల్లో నింపడం తల్లిదండ్రుల బాధ్యత గా పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే దయ , గౌరవం నేర్పించడం. తెలివితేటలు, సక్సెస్ ఎంత ముఖ్యమో? ఎదుటివారి పట్ల కరుణ చూపడం కూడా అంతే ముఖ్యమని ప్రియాంక భావిస్తారు. ఇంటికి వచ్చే పెద్దలను గౌరవించడం, తోటి వారితో మర్యాదగా ప్రవర్తించడం వంటి విలువలు పిల్లల వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయన్నారు.

ఈ సంస్కారమే రేపటి సమాజంలో వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుందని ప్రియాంక గట్టిగా చెబుతున్నారు.

మూలాలను మర్చిపోకూడదు. ప్రియాంక విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తన కుమార్తెకు భారతీయ సంస్కృతి, పండుగలు , సంప్రదాయాల గురించి నిరంతరం వివరిస్తుంటారు. పిల్లలకు వారి గుర్తింపు గురించి అవగాహన ఉండాలన్నారు. తమ కుటుంబ నేపథ్యం, భాష పట్ల వారికి గౌరవం క‌లిగేలా చూడాల‌న్నారు. ఇది పిల్లలకు మానసిక స్థిరత్వాన్ని ,బంధాల పట్ల మమకారాన్ని కలిగిస్తుందన్నారు. కెరీర్ ని , ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం.

పని చేసే తల్లులు తమ కలల కోసం కష్టపడుతున్నందుకు ఎప్పుడూ గిల్ట్ ఉండకూడదని ప్రియాంక సూచించారు. తల్లిదండ్రులు కష్టపడి పనిచేయడం చూసి పిల్లలు కూడా బాధ్యతను అలవాటు చేసుకుంటారు. పిల్లలతో గడిపే సమయం ఎంత అన్నది కాదు. ఆ సమయంలో వారితో ఎంత నాణ్యంగా ఉన్నామన్నదే ముఖ్యమ‌న‌నారు. `ది బ్లఫ్` వంటి భారీ చిత్రాల షూటింగ్ సమయంలోనూ ఆమె తన కుమార్తెను సెట్స్‌కు తీసుకెళ్లి మరీ సమయం కేటాయించిన‌ట్లు గుర్తు చేసుకున్నారు. పిల్లల వ్యక్తిత్వాన్ని గౌరవించడం. తల్లిదండ్రులు తమ కలలను పిల్లలపై రుద్దకూడదన్నారు. వారిలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. ప్రతి బిడ్డ ఒక ప్రత్యేక ప్రపంచమని, ఒకరితో ఒకరిని పోల్చడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రియాంక చోప్రా పంచు కున్న ఈ విలువైన‌ 5 సూత్రాలు నేటి తరం తల్లి దండ్రులకు ఒక చక్కని గైడ్‌లా పని చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.