పిక్‌టాక్ : ఇంత ఎలా సాధ్యం మందాకిని
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక చోప్రా గురించి ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
By: Ramesh Palla | 27 Feb 2026 4:22 PM ISTమహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక చోప్రా గురించి ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఈమె గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు హాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ, సిరీస్‌ల్లో నటించిన ప్రియాంక చోప్రా ఇటీవల బాలీవుడ్ సినిమాలకు ఓకే చెప్పింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియాలో ప్రియాంక చోప్రా ఎక్కువగా కనిపిస్తుంది అంటూ ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈమె ఒక ఈవెంట్‌లో పాల్గొంది. ఆ సమయంలో ధరించిన ఔట్ ఫిట్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ప్రియాంక చోప్రా అందం గురించి ఎప్పటికప్పడు మాట్లాడుకోవడం చాలా కామన్ విషయం, అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా...
తమిళన్ అనే తమిళ సినిమాతో 2002లో ఇండస్ట్రీకి పరిచయం అయిన ప్రియాంక చోప్రా చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అక్కడ భారీ విజయాలను దక్కించుకోవడంతో టాప్ స్టార్ హీరోయిన్‌గా మారింది. 2003లో వచ్చిన హిందీ మూవీ ది హీరో : లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై తో ప్రియాంక చోప్రా బాలీవుడ్ వారికి దగ్గర అయింది. ఆ సినిమాలో ప్రియాంక చోప్రా నటన సైతం ఆకట్టుకుంది. 2008లో ప్రియాంక చోప్రా చేసిన ఫ్యాషన్ మూవీ పాత్రకు గాను ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా సుదీర్ఘ కాలం పాటు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా, అత్యధిక పారితోషికం దక్కించుకున్న హీరోయిన్‌గా నిలిచింది. అక్కడ నుంచి హాలీవుడ్ కూడా వెళ్లడంతో అక్కడ ఈమెకు మంచి పేరు, మంచి పారితోషికం దక్కిన విషయం తెల్సిందే.
హాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసిన పీసీ
హాలీవుడ్‌లో ఈ అమ్మడి క్రేజ్‌కి, వరుస ఆఫర్లు దక్కడానికి కారణం ఈమె అందం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. వికీపీడియా అనుసారం ప్రియాంక చోప్రా వయసు 43 ఏళ్లు. సాధారణంగా హీరోయిన్స్ మూడు పదుల వయసు దాటిన వెంటనే కనిపించకుండా పోతారు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం ఇంకా ఒక వెలుగు వెలుగుతూనే ఉంది. ఆమె తోటి హీరోయిన్స్ చాలా మంది ఇప్పటికే ఆంటీగా, అమ్మగా సినిమాలు చేస్తున్నారు. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా ఇంత అందం ఎలా అంటూ చాలా మంది ఈమెను ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ స్థాయి అందం ఎలా సాధ్యం అంటూ అభిమానులతో పాటు అంతా కూడా తెగ కామెంట్ చేస్తూ తాజాగా ఆమె పాల్గొన్న కార్యక్రమానికి చెందిన ఈ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోల్లో ఆమెను చూస్తే కచ్చితంగా 30+ వయసు అనుకునే వారు ఎక్కువ మంది ఉంటారు.
మహేష్ బాబు, రాజమౌళి వారణాసి సినిమాలో..
ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ను మందాకిని పాత్రలో రాజమౌళి చూపించబోతున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ఇప్పటి వరకు చాలా విభిన్నమైన పాత్రలు చేసింది. కానీ ఈ పాత్ర అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రియాంక చోప్రా యొక్క మందాకిని లుక్ ను రివీల్ చేయడం జరిగింది. రాజమౌళి హీరోయిన్స్ ను ఎంత అందంగా చూపిస్తాడో తెలిసిందే. అందుకే ప్రియాంక చోప్రాను ఈ సినిమాలో ఆహా అన్నట్లుగా చూపించడం ఖాయం అనిపిస్తోంది. మహేష్ బాబుకు ఈమె సరి జోడి అనిపించే విధంగా మందాకిని పాత్ర, లుక్ ఉండాలని అంతా కోరుకుంటున్నారు. నటనలో సుదీర్ఘమైన అనుభం ఉన్న ప్రియాంక చోప్రా నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది అనేది కొందరి మాట. వచ్చే ఏడాది రాబోతున్న వారణాసితో ప్రియాంక చోప్రా క్రేజ్ మరింత పెరుగుతుందా అనేది చూడాలి.
