Begin typing your search above and press return to search.

ఈ హీరోయిన్ నాలుగు సినిమాల బ‌డ్జెట్ 5000 కోట్లు

అగ్ర క‌థానాయిక ప్రియాంక చోప్రా న‌టించిన‌ రెండు ప్రాజెక్టుల బ‌డ్జెట్ 4200కోట్లు. నాలుగు సినిమాల బ‌డ్జెట్ 5000 కోట్లు.. ఈ లెక్క‌లు చూస్తుంటే మ‌తి చెడిపోతోంది క‌దూ? కానీ ఇది నిజం.

By:  Sivaji Kontham   |   14 Feb 2026 1:00 AM IST
ఈ హీరోయిన్ నాలుగు సినిమాల బ‌డ్జెట్ 5000 కోట్లు
X

అగ్ర క‌థానాయిక ప్రియాంక చోప్రా న‌టించిన‌ రెండు ప్రాజెక్టుల బ‌డ్జెట్ 4200కోట్లు. నాలుగు సినిమాల బ‌డ్జెట్ 5000 కోట్లు.. ఈ లెక్క‌లు చూస్తుంటే మ‌తి చెడిపోతోంది క‌దూ? కానీ ఇది నిజం. ఇంత భారీ బ‌డ్జెట్ల‌తో నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో భాగం అవుతున్న ఏకైక న‌టి పీసీ.

మ‌హేష్ - రాజ‌మౌళితో క‌లిసి చేస్తున్న వార‌ణాసి 150 మిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్ తో రూపొందుతోంది.. అంటే సుమారు 1400 కోట్లకు ఇది స‌మానం. ఇప్ప‌టికే స్ట్రీమింగ్ లో ఉన్న వెబ్ సిరీస్ `సిటాడెల్`కి 300 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేసారు. అంటే సుమారు రూ.2800కోట్ల బ‌డ్జెట్ వెచ్చించారు. త‌దుప‌రి సిటాడెల్ సీజ‌న్ 2 విడుద‌ల కావాల్సి ఉంది. సిటాడెల్ సీజ‌న్ 1 లో ప్రియాంక చోప్రా యాక్ష‌న్ ప్యాక్డ్ రోల్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. పీసీ న‌టించిన వాటిలో, కేవ‌లం రెండు ప్రాజెక్టుల కోసం ఖ‌ర్చ‌యిన బ‌డ్జెట్ 4200 కోట్లు.

ప్ర‌స్తుతం `వార‌ణాసి` చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. ఆ త‌ర్వాత కూడా అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందించ‌నున్న చిత్రాల‌లో ప్రియాంక చోప్రా న‌టిస్తోంది. త‌దుప‌రి హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న క్రిష్ 4 లో న‌టించాల్సి ఉంది. ఈ సినిమా బ‌డ్జెట్ 500 కోట్లు అని ప్ర‌చారం ఉంది. కానీ భాగస్వామ్య నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్ తో స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ ప్రాజెక్ట్ ఆల‌స్య‌మ‌య్యేందుకు ఛాన్సుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అలాగే ఫ‌ర్హాన్ అక్త‌ర్ తో జీలే జ‌రా లాంటి భారీ మ‌ల్టీస్టార‌ర్ లోను ప్రియాంక చోప్రా న‌టించాల్సి ఉంది. ఈ సినిమా బ‌డ్జెట్ 200 కోట్లు అని ప్ర‌చారం ఉంది. పై నాలుగు సినిమాలు క‌లుపుకుంటే సుమారు 5000 కోట్ల బ‌డ్జెట్ అంచ‌నా.

ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ ఐకాన్‌గా ఎదుగుతూ, భారతీయ సినిమా చరిత్రలోనే ఏ నటికీ సాధ్యం కాని రీతిలో భారీ బ‌డ్జెట్‌ ప్రాజెక్టులతో దూసుకెళుతోంది. వార‌ణాసిలో ప్రియాంక `మందాకిని` అనే ప‌వ‌ర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో రామాయ‌ణం స్ఫూర్తితో తెర‌కెక్కిస్తున్న‌ 25 నిమిషాల యుద్ధ సన్నివేశం సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది. రాజ‌మౌళి ఆ ఒక్క సీన్ కోస‌మే వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని స‌మాచారం. మ‌రోవైపు ప్రియాంక చోప్రా న‌టించిన సిటాడెల్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయింది. ఈ సిరీస్ `లార్డ్ ఆఫ్ ది రింగ్స్` తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఒక ఎపిసోడ్ కే ఏకంగా 500కోట్లు ఖ‌ర్చు చేసారు.

భార‌తీయ న‌టీమ‌ణుల‌లో మరెవరికీ సాధ్యం కానిది ప్రియాంక చోప్రాకు సాధ్య‌మైంది. ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనే వంటి స్టార్లకు హాలీవుడ్ అవకాశాలు వచ్చినా ప్రియాంక లాగా అక్కడ ఒక లీడ్ యాక్టర్ గా నిలబడి.. ఇంతటి భారీ బడ్జెట్ చిత్రాలను మోయగలిగే స్థాయికి వెళ్లడం విశేషం.

ప్రియాంక చోప్రా కేవలం ఒక నటిగానే కాకుండా, గ్లోబల్ మార్కెట్‌లో ఒక బ్రాండ్‌గా మారారు. భారతీయ సినిమా, హాలీవుడ్ సినిమాల మధ్య ఒక బలమైన వారధిగా నిల‌బ‌డుతూ త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తున్నారు.