OG బ్యూటీకి సరైన ఛాన్స్ దొరికిందా? గట్టి ఆన్సర్ ఇస్తుందా?
టాలీవుడ్ సినీ ప్రియులకు గ్యాంగ్ లీడర్ సినిమాతో పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్.
By: M Prashanth | 3 Jun 2026 5:00 AM ISTటాలీవుడ్ సినీ ప్రియులకు గ్యాంగ్ లీడర్ సినిమాతో పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్. తక్కువ సమయంలోనే సౌత్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అందం, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. తెలుగు, తమిళ భాషల్లో పలువురు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు సొంతం చేసుకున్నారు. అయితే కమర్షియల్ హిట్లు దక్కినా, యాక్టింగ్ విషయంలో మాత్రం ఆమెపై తరచూ విమర్శలు వినిపించాయి.
నాని సరసన గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం చిత్రాలు, శివకార్తికేయన్ తో డాక్టర్, డాన్, ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ముఖ్యంగా భారీ ప్రాజెక్ట్ ఓజీలో పవన్ కల్యాణ్ సరసన నటించడం ద్వారా ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కొందరు ఆమె యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ పై ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రియాంకకు ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం మంజనాతిలో ఆమె ఫిమేల్ రోల్ లో నటించనున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సాగే ఆ సినిమా కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా ఉండబోతున్నట్లు సమాచారం. కథలో యాక్టింగ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటంతో ప్రియాంక అరుల్ మోహన్ టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇదేనని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
మారి సెల్వరాజ్ సినిమాలు నార్మల్ స్ట్రాంగ్ స్టోరీ, నేచురల్ రోల్స్, ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఇస్తుంటాయి. అలాంటి దర్శకుడి సినిమాలో అవకాశం రావడం ప్రియాంక కెరీర్ కు ప్లస్ గా మారొచ్చని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో కనిపించిన ఆమె.. ఈసారి యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలో మెప్పిస్తే విమర్శకుల ప్రశంసలు కూడా అందుకునే అవకాశం ఉంది.
అయితే ఆ క్యాస్టింగ్ పై సోషల్ మీడియాలో మిక్స్ డ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. కొందరు ప్రియాంక అరుల్ మోహన్ ఈ తరహా రోల్ కు సరిపోతుందా అని డౌట్స్ వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఆమెకు సరైన కథ, పాత్ర దొరికితే తప్పకుండా మెప్పించగలదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాలంటే ఇలాంటి సినిమాలు కీలకమని అభిమానులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రియాంక కెరీర్ లో మంజనాతి ఒక టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం గ్లామర్ హీరోయిన్ అనే ఇమేజ్ ను దాటి నటిగా తన స్టామినా ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఇదే. మారి సెల్వరాజ్ లాంటి దర్శకుడి విజన్ కు తగ్గట్టుగా ఆమె నటిస్తే, ఆ సినిమా ప్రియాంక కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలవొచ్చు. మరి ఆ ఛాన్స్ ను ఆమె ఎంతవరకు యూజ్ చేసుకుంటుందో అంతా వేచి చూడాలి.
