మళ్లీ ఐదేళ్లకు సొంత పరిశ్రమలో!
కన్నడ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ గురించి పరిచయం అసవరం లేదు. నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అటుపై 'సరిపోదా శనివారం' తో మరో హిట్ ఖాతాలో వేసుకుంది.
By: Srikanth Kontham | 22 Nov 2025 1:00 AM ISTకన్నడ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ గురించి పరిచయం అసవరం లేదు. నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అటుపై 'సరిపోదా శనివారం' తో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఇటీవల రిలీజ్ అయిన 'ఓజీ' లోనూ భాగమైంది. ఈ సినిమా విజయంతోనూ ప్రియాంక పేరు వైరల్ గా మారింది. అయితే టాలీవుడ్ లో అమ్మడి కెరీర్ మాత్రం ఇంకా ఊపందుకోలేదు. కెరీర్ ప్రారంభమై ఐదేళ్లు అవుతున్నా? వేగం పుంజుకోలేదు. అందం ..అభినయం అన్ని ఉన్నా? అవకాశాలు అందుకోవడంలో వెనుకబడుతోంది.
తమిళ్ లో సినిమాలు చేస్తోంది. అడపా దడపా తెలుగులోనూ ఛాన్సులందుకుంటోంది. అయితే సొంత పరిశ్రమలో మాత్రం డెబ్యూ చిత్రం తర్వాత మరో సినిమా చేయలేదు. ఐదేళ్ల క్రితం 'ఓంద్ కతే హెల్లా' చిత్రంతో లాంచ్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఇంత వరకూ కన్నడలో సినిమా చేయలేదు. అవకాశాలు వచ్చినా? అమ్మడు మనసంతా తెలుగు, తమిళ సినిమాలపైనే ఉండటంతో? ఇక్కడే దృష్టి పెట్టి పని చేసింది. ఈ నేపథ్యంలో సొంత పరిశ్రమలో చాలా అవకాశాలు కొల్పోయింది. అలాగని టాలీవుడ్ లో..కోలీవుడ్ లో తాను పెద్దగా సాధించింది కూడా లేదు.
ఈ నేపథ్యంలో అమ్మడు మళ్లీ సొంత పరిశ్రమపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ హీరోగా '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' అనే సినిమా తెరకెక్కుతోంది. 'సప్తసాగరాలు దాటి' ఫేం హేమంత్ ఎం. రావు దర్శకత్వం వహిస్తసున్నారు. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ని ఎంపిక చేసారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా విషయం అధికారికంగా వెల్లడించారు. సౌత్ నుంచే కొంత మంది భామలను పరిశీలించిన అనంతరం ప్రియాంకను ఫైనల్ చేసారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రియాంక సొంత భాషలో పని చేస్తోంది.
మరి ఇప్పటి నుంచైనా కన్నడ సినిమాలపై దృష్టి పెడుతుందా? ఈ సినిమా వరకే పరిమితం అవుతుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. కవిన్ హీరోగా నటిస్తోన్న ఓ చిత్రంలో అతడికి జోడీగా నటిస్తోంది. అలాగే 'మేడ్ ఇన్ కేరళ' టైటిల్ తో తెరకెక్కుతోన్న మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కవిన్ తో సినిమా ప్రారంభమై నెలలు గడుస్తున్నా? అనివార్య కారణలతో డిలే అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.
