పవన్ హీరోయిన్ రెట్రోలుక్ అదిరింది!
లావెండర్ రంగు ఉన్న షర్ట్, పూల డిజైన్ ఉన్న స్కర్ట్ ధరించింది. పోస్టర్‌లో మాళవిక వింజేట్ లుక్‌తో మోడ్రన్ స్టైల్‌లో ఉన్న తనని చూపించారు.
By: Tupaki Entertainment Desk | 27 Dec 2025 7:45 PM ISTఈ ఏడాది పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `ఓజీ`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది కన్నడ సోయగం ప్రియాంక అరుళ్‌మోహన్. ఈ మూవీ అందించిన సక్సెస్‌తో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న తను 2026లో మూడు క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించడాని సిద్ధమవుతోంది. తమిళంలో రెంగు సినిమాలు చేస్తున్న ప్రియాంక కన్నడలో డాలీ ధనంజయ హీరోగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న `666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్`లో నటిస్తోంది.
హేమంత్ ఎం. రావు దర్శకుడు. 1970వ దశకం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన శివరాజ్‌కుమార్, డాలీ ధనంజయ వింటేజ్ లుక్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. భారీ క్రేజీ కాస్టింగ్‌తో పాటు టాలెంటెడ్ టెక్నీషియన్‌లు వర్క్ చేస్తున్న ఈ మూవీపై శివరాజ్ కుమార్‌తో పాటు డాలీ ధనంజయ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడు. 70వ దశకం నేపథ్యంలో సాగే ఈ మూవీ కోసం ఆ టైమ్‌ని రీక్రియేట్ చేస్తూ మేకర్స్ పలు సెట్‌లని రూపొందించారు.
ఈ భారీ సెట్‌లలో ప్రస్తుతం షూటింగ్ జరుగతోంది. భారీ ఖర్చుతో నిర్మించిన ఈ సెట్‌లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని కన్నడ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా క్రేజీ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఫస్ట్ లుక్‌కు సంబంధించిన రెండు వేరు వేరు పోస్టర్లని మేకర్స్ శనివారం విడుదల చేశారు. ఈ పోస్టర్లలో ప్రియాంక వింటేజ్ లుక్ సినీ లవర్స్‌తో పాటు ఆమె అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేస్తోంది. ఫస్ట్ ఫొటోలో ప్రియాంక వెనుక బంగారు వర్ణంలో కనిపిస్తున్న చంద్రుడిని చూపించారు.
లావెండర్ రంగు ఉన్న షర్ట్, పూల డిజైన్ ఉన్న స్కర్ట్ ధరించింది. పోస్టర్‌లో మాళవిక వింజేట్ లుక్‌తో మోడ్రన్ స్టైల్‌లో ఉన్న తనని చూపించారు. వింటేజ్ లుక్‌లో కనిపిస్తూనే నేటి కాలం నాటి ఇయర్ ఫోన్స్‌ని తను ధరించినట్టుగా చూపించడంతో ఇదొక టైమ్ ట్రావెల్ స్టోరీ అని అంతా భావిస్తున్నారు. రెండవ పోస్టర్‌లో హ్యాట్ ధరించి రెట్రో లుక్‌లో కనిపిస్తున్న ప్రియాంక సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. చేతికి, మెడలో ముత్యాల హారాలు, చేతులకి బ్లాక్ గ్లౌసెస్ ధరించి ఇది కూడా క్లాసిక్ టైమ్‌లో సాగే వింటేజ్ లుక్‌లా కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే రెట్రో లుక్‌లో కనిపిస్తోంది.
ఇక ఈ మూవీని 1970వ దశకం నేపథ్యంలో రూపొందిస్తుండటంతో ఆ టైమ్ పీరియడ్‌కు సంబంధించిన భారీ సెట్‌లని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రత్యేక వీడియోని జనవరిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని కన్నడతో పాటు తెలుగులో మాత్రమే రిలీజ్ చేయబోతున్నారు.
