Begin typing your search above and press return to search.

సౌత్ మినహా అంద‌రిపై ప్రియ‌మ‌ణి సెటైర్!

తెలుగు సినిమా పాన్ ఇండియాలో స‌త్తా చాట‌డంతో? బాలీవుడ్ నే ప‌క్క‌కు పెట్టి నెంబ‌ర్ వ‌న్ ప‌రిశ్ర‌మ‌గా నేడు టాలీవుడ్ నీరాజ‌నాలు అందుకుంటుంది.

By:  Srikanth Kontham   |   26 Oct 2025 2:00 AM IST
సౌత్ మినహా అంద‌రిపై ప్రియ‌మ‌ణి సెటైర్!
X

ఒక‌ప్పుడు సౌత్ సినిమాలంటే? అందులోనూ తెలుగు సినిమాలంటే? బాలీవుడ్ లో చిన్న చూపు ధోర‌ణి క‌నిపించేది భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌లో నెంబ‌ర్ వ‌న్ పరిశ్ర‌మ ఏదంటే? అంతా బాలీవుడ్ పేరు చెప్పేవారు. బాలీవుడ్ త‌ర్వాతే మిగ‌తా ప‌రిశ్ర‌మ‌ల గురించి చర్చ జ‌రిగేది. ప్ర‌త్యేకించి తెలుగు సినిమా అంటే పెద్ద‌గా హైలైట్ అయ్యేది కాదు. ప‌క్క‌నే ఉన్న కోలీవుడ్ కూడా తెలుగు ప‌రిశ్ర‌మ అంటే చిన్న చూపుతూనే వ్య‌వ‌హ‌రించేది. నేడు ప‌రిస్థితి అందుకు భిన్నం అనుకోండి. తెలుగు సినిమా పాన్ ఇండియాలో స‌త్తా చాట‌డంతో? బాలీవుడ్ నే ప‌క్క‌కు పెట్టి నెంబ‌ర్ వ‌న్ ప‌రిశ్ర‌మ‌గా నేడు టాలీవుడ్ నీరాజ‌నాలు అందుకుంటుంది.

అప్ప‌ట్లో ప‌ట్టించుకునే ప‌రిస్థితే లేదు:

బాలీవుడ్..కోలీవుడ్ హీరోలే మాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ టాలీవుడ్ కి దిగొస్తున్నారు. టాలీవుడ్ మేకర్స్ ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురు చూస్తున్నారు. తాజాగా సౌత్ ట్యాలెంట్ ని ఉద్దేశించి న‌టి ప్రియ‌మ‌ణి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఉత్త‌రాది ప్రేక్ష‌కులు ఇప్ప‌టికైనా సౌత్ సినిమాల‌కు ఆద‌రిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రాంతీయ భాషా చిత్రాల‌ను అక్క‌డ వారు ఎంతో ఆద‌రిస్తున్నారంది. సౌత్ నుంచి ఎన్నో మంచి సినిమాలు గ‌తంలో నార్త్ లో రిలీజ్ అయ్యేవి. కానీ వాటికి ఆద‌ర‌ణ అంతంత‌ మాత్రంగా ఉండేది. క‌నీసం ప‌ట్టించుకునే ప‌రిస్థితి కూడా ఉండేది కాదు.

అంత‌రం తొలిగిపోతున్న వేళ‌:

చ‌ర్చ అనే మాట కూడా ఉండేది కాదు. నేడు ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది. హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాల గురించే ఎక్కువ‌గా మాట్లాడుకుంటున్నారు. ప్ర‌త్యేకించి తెలుగు సినిమా నిరంత‌ర‌ చ‌ర్చ గా మారింది. రిలీజ్ అయ్యాయి..పోయాయి అని కాకుండా కొత్త కొత్త రికార్డులు సృస్టిస్తున్నాయి. సినిమాల గురించి కాదు ఆ సినిమా కోసం ప‌ని చేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు ఇలా అన్ని విభాగాల్లో ఎవ‌రెవ‌రు? ప‌నిచేసార‌ని మాట్లాడుకుంటు న్నారు. ఇది ఎంతో శుభ‌ప‌రిణామం. సౌత్ -నార్త్ అనే సినిమాకు ఉన్న అంత‌రం మొల్ల‌గా తొలిగిపోతుందంది.

అన్ని ప‌రిశ్ర‌మ‌లోనూ స‌త్తా చాటిన న‌టి:

రెండు ప‌రిశ్ర‌మ‌ల మ‌ధ్య ఉన్న గీత‌లు పూర్తిగా చెరిగిపోయే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయంది. ఒక‌ప్పుడు సౌత్ సినిమాను విమ‌ర్శించిన నోళ్ల‌న్ని ఇప్పుడు మూగ‌బోయాయంది. ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణి న‌టిగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సౌత్ లో అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చ‌స్తోంది. వాటితో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ న‌టిస్తోంది. బాలీవుడ్ లో కూడా అవ‌కాశాలు అందుకుంటుంది. ఇప్ప‌టికే హిందీ ప‌రిశ్ర‌మ‌లో అమ్మ‌డు త‌న‌దైన ముద్ర వేసిన సంగ‌తి తెలిసిందే.