Begin typing your search above and press return to search.

పెళ్లైనా త‌గ్గేదేలే కాక‌పోతే కొంచెం ఆలోచించి!

వెండి తెర‌పై ప్రియ‌మ‌ణి గ్లామ‌ర్ అప్పిరియ‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఫాంలో ఉన్నంత కాలం గ్లామ‌ర్ పాత్ర‌ల్లో ఎంత మాత్రం వెన‌క‌డుగు వేయ‌లేదు.

By:  Srikanth Kontham   |   9 March 2026 11:18 AM IST
పెళ్లైనా త‌గ్గేదేలే కాక‌పోతే కొంచెం ఆలోచించి!
X

వెండి తెర‌పై ప్రియ‌మ‌ణి గ్లామ‌ర్ అప్పిరియ‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఫాంలో ఉన్నంత కాలం గ్లామ‌ర్ పాత్ర‌ల్లో ఎంత మాత్రం వెన‌క‌డుగు వేయ‌లేదు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ నిర్ణ‌యాల‌తోనే ముందుకెళ్లింది. తెర‌పై బోల్డ్ గా క‌నిపించాల‌న్నా? ఇంటిమేట్ స‌న్నివేశాల్లో చెల‌రేగాల‌న్నా...లిప్ లాక్, బికినీ, టూపీస్ ఇలా ఎలాంటి దుస్తులు ధరించ‌ల‌న్నా? అడ్డు చెప్పిన సంద‌ర్భాలంటూ లేవు. పూర్తిగా ద‌ర్శ‌కుల హీరోయిన్ గానే ప‌ని చేసింది. రెండు ద‌శాబ్దాల‌ న‌ట ప్ర‌యాణంలో ప్రియ‌మ‌ణి ఎన్నో గ్లామ‌ర్ పాత్ర‌లు పోషించింది. సౌత్ లో అన్ని భాష‌ల్లోనూ న‌టించింది.

బాలీవుడ్ లో సైతం త‌న‌దైన ముద్ర వేసింది. అక్క‌డ న‌టించింది కొన్ని సినిమాలే అయినా ఐకానిక్ పాత్ర‌ల‌తో అద‌రగొట్టింది. కాల‌క్ర‌మంలో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో టీవీ షోలు కూడా మొద‌లు పెట్టింది. ఈ మ‌ధ్య ప్ర‌యాణంలో ముస్తాఫ్ రాజ్ ను ప్రేమ వివాహం చేసుకుని ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తుంది. హీరోయిన్ గా వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంటుంది. సాధార‌ణంగా ఏ న‌టికైనా ఇంత లాంగ్ కెరీర్ కష్టం. కానీ ప్రియ‌మ‌ణి ఆ విష‌యంలో తెలివైన నిర్ణ‌యాల‌తో ముందుకెళ్తుంది.

మ‌రి ఇక‌పై గ్లామ‌ర్ పాత్ర‌లు పోషిస్తుందా? అంటే సాధార‌ణంగా వివాహ‌మైన త‌ర్వాత ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కు దూరంగా ఉంటారు. ప్ర‌త్యే కించి బికీనీ, టూపీస్ ధ‌రించి న‌టించ‌డానికి ఎంత‌మాత్రం అంగీక‌రించ‌రు. ప్ర‌త్యేకించి సౌత్ న‌టీమ‌ణులు అత రిస్క్ తీసుకోరు. ఈ విష‌యంలో బాలీవుడ్ భామ‌లంత వేగాన్ని చూపించారు. వాళ్లు కూడా అత్య‌వ‌సరం, ద‌ర్శ‌కుడు డిమాండ్ చేస్తే త‌ప్ప ఛాన్స్ తీసుకోవ‌డానికి ఆస‌క్తి చూపించ‌రు. కానీ ప్రియ‌మ‌ణి మాత్రం పెళ్లైనా కూడా అలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో వెనుక‌డుగు వేసేలా లేదు.

అలాంటి అవ‌కాశం వ‌స్తే గ‌నుక ఆలోచించి నిర్ణ‌యం తీసుకున్నా? అది అంద‌రికీ అనుకూలంగా ఉండేలా ఉంటుంద‌ని తెలిపింది. గ‌తంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రియ‌మ‌ణిని ఉద్దేశించి ఓ హాట్ కామెంట్ వ‌దిలిన సంగ‌తి తెలిసిందే. బ‌న్నీతో నటించే అవ‌కాశ‌మే రాలేదు అన‌గా? ప‌ర్వాలేదు అందుకు స‌మ‌యం మించిపోలేదు. మీరు ఇప్ప‌టికీ హాట్ గానే ఉన్నారు. క‌చ్చితంగా ఇద్దరం క‌లిసి సినిమా చేద్దామ‌ని బ‌న్నీ ప్రియ‌మ‌ణిలో ఉత్సాహం నింపారు. ఈ విష‌యంలో ప్రియ‌మ‌ణి నిజంగా గ్రేట్. ఇప్ప‌టికీ అదే బ్యూటీని మెయింటెన్ చేస్తూ కుర్రాళ్ల మ‌తులు చెడ‌గొడుతుంది. అమ్మ‌డి వ‌య‌సు 40 ఏళ్లు దాటినా న‌వ నాయిక‌ల‌కు ఏమాత్రం త‌గ్గ‌లేదు.