'ప్రేమంటే' టీజర్ టాక్: పెళ్లికి ముందు ఊహలు.. పెళ్లి తర్వాత తిప్పలు!
టీజర్ చూస్తుంటే, ఇది ప్రతీ పెళ్లయిన జంటకు, కాబోయే జంటకు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ లా ఉంది.
By: M Prashanth | 2 Nov 2025 5:30 PM ISTఈ మధ్య కాలంలో కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. బలగం, కోర్ట్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత, ప్రియదర్శి వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. అదే, 'ప్రేమంటే.. థ్రిల్ యు ప్రాప్తిరస్తు!'. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తుండగా, సుమ కనకాల ఒక కీ రోల్‌లో కనిపిస్తున్నారు. నవంబర్ 21న రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టీజర్ చూస్తుంటే, ఇది ప్రతీ పెళ్లయిన జంటకు, కాబోయే జంటకు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ లా ఉంది. పెళ్లి చూపుల్లో హీరో (ప్రియదర్శి), హీరోయిన్ (ఆనంది) ఒకరికొకరు తమ మ్యారీడ్ లైఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ గురించి చెప్పుకుంటారు. ఇక్కడే డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ అసలు సిసలైన ఫన్ క్రియేట్ చేశాడు. వాళ్లు ఊహించుకున్న దానికి, రియాలిటీలో జరిగేదానికి మధ్య ఉన్న తేడాను చాలా ఫన్నీగా చూపించారు.
"నా వల్ల నా భార్యకు ఏ ప్రాబ్లమ్ రాకూడదు" అని హీరో ఆశపడితే, రియాలిటీలో మాత్రం ఇంట్లో టవల్ కట్టుకుని డ్యాన్సులు వేస్తూ, ఆమెను తెగ ఇబ్బంది పెడుతుంటాడు. ఇక హీరోయిన్ ఏమో, "రోజంతా కొట్టుకున్నా, రాత్రికి మాత్రం కూర్చుని, చాయ్ తాగుతూ మాట్లాడుకుని, ప్రేమతో పడుకోవాలి" అని చాలా డీసెంట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. కానీ, రియాలిటీలో మాత్రం ఇద్దరూ "రమ్యా.. సెకండ్ సెటప్ లాంటిది ఏం లేదు రమ్యా" అంటూ గట్టిగా గొడవ పడుతుంటారు.
ఈ టీజర్‌లో ప్రియదర్శి తనదైన కామెడీ టైమింగ్‌తో చెలరేగిపోయాడు. ఆయన అమాయకపు ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి. ఆనంది కూడా తన పాత్రలో చాలా క్యూట్‌గా, నేచురల్‌గా కనిపించింది. ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ సుమ కనకాల. ఆమె 'ఆశా మేరీ' అనే ఒక ఫన్నీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. డెస్క్ మీద పడుకున్న సుమను, వెన్నెల కిషోర్ మైక్‌లో అరిచి లేపే సీన్ చాలా హిలేరియస్‌గా ఉంది.
టీజర్‌కు లియోన్ జేమ్స్ అందించిన బీజీఎం చాలా ఫ్రెష్‌గా, సినిమా మూడ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఝాన్వీ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. మొత్తానికి, 'ప్రేమంటే' టీజర్ ఒక వైల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ రైడ్ అని ట్యాగ్ లైన్ వేసినా, ఇది యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునేలాగే ఉంది. మరి సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
