నాని స్టేట్మెంట్ ప్రియదర్శి కాపీ పేస్ట్.. ఎందుకు..?
ఐతే నాని రూట్ లోనే కాస్త డిఫరెంట్ గా కెరీర్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న ప్రియదర్శి ఈవెంట్ లో నాని స్టేట్మెంట్స్ ని కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాడు.
By: Ramesh Boddu | 14 Oct 2025 10:06 AM ISTకమెడియన్ గానే కాదు కొన్ని సినిమాల్లో లీడ్ రోల్ గా చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు ప్రియదర్శి. అతని కామెడీ టైమింగ్.. అతని స్టోరీ సెలక్షన్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ప్రియదర్శి సినిమాలో ఉంటే సంథింగ్ స్పెషల్ అనిపించేలా క్రేజ్ తెచ్చుకున్నాడు. హీరోల పక్క సైడ్ రోల్స్ చేసే స్టేజ్ నుంచి లీడ్ రోల్స్ చేసే రేంజ్ కి వెళ్లాడు. ప్రియదర్శి లేటెస్ట్ మూవీ మిత్ర మండలి మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియదర్శి స్పీచ్ ఎప్పటిలానే ఆకట్టుకుంది.
నాని రూట్ లోనే కాస్త డిఫరెంట్ గా కెరీర్ ప్లాన్..
ఐతే నాని రూట్ లోనే కాస్త డిఫరెంట్ గా కెరీర్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న ప్రియదర్శి ఈవెంట్ లో నాని స్టేట్మెంట్స్ ని కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాడు. అదేంటి ఎందుకలా అంటే.. నాని ఎలాగైతే ప్రతి సినిమాను చాలా కమిటెడ్ గా చేస్తాడో.. అలానే ప్రియదర్శి కూడా కమిటెడ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సినిమాను ఎలా ప్రేమించాలో నాని అన్న నేర్పించాడు.. గొప్ప స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు ఎలా చేయాలో నేర్పించాడని అన్నాడు ప్రియదర్శి.
అందుకే మిత్ర మండలి సినిమా చూసొచ్చి చెబుతున్నా ఈ సినిమా వచ్చి చూడండి ఈ సినిమా నచ్చకపోతే నెక్స్ట్ సినిమా చూడొద్దని అన్నాడు. నాని స్టేట్మెంట్ వాడుతున్నా కానీ సినిమా మీద తనకున్న నమ్మకం అలాంటిదని అంటున్నాడు ప్రియదర్శి. ఇక ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన శ్రీవిష్ణు గురించి కూడా ప్రియదర్శి చెప్పాడు. ఇండస్ట్రీని ఒక ప్రోగ్రెషన్ లోకి తీసుకెళ్తున్నాడని.. శ్రీవిష్ణు సినిమా అయితే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లిపోతామని అన్నాడు ప్రియదర్శి.
ఫ్యామిలీ కలిసి కూర్చుని హ్యాపీగా చూసే సినిమా..
మిత్ర మండలి అందరు ఫ్యామిలీ కలిసి కూర్చుని హ్యాపీగా చూసే సినిమా.. లవ్ ఫ్రం మూవీ.. నా సినిమా మీద ఉన్న నా కమిట్మెంట్ ఎలాంటిదో అని చెప్పేందుకే సినిమా నచ్చకపోతే నెక్స్ట్ సినిమా చూడొద్దని అంటున్నానని అన్నాడు ప్రియదర్శి. చిన్న చిన్న రోల్స్ చేస్తూ అక్కడ ఇంపాక్ట్ చూపించి నెక్స్ట్ లీడ్ ఛాన్స్ లు అందుకుంటున్నాడు ప్రియదర్శి. అంతేకాదు మల్లేశం, బలగం, కోర్ట్ ఇలా డిఫరెంట్ కథలతో వచ్చే సినిమాలు చేస్తూ ప్రియదర్శి తన క్రేజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు.
ప్రియదర్శి సినిమాల ఎంపిక ఇంప్రెస్ చేస్తుంది. మిత్ర మండలిలో రాగ్ మయూర్, విష్ణు తో పాటు ప్రియదర్శి స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాడు. సినిమాలో సోషల్ మీడియాతో క్రేజ్ తెచ్చుకున్న నిహారిక ఎన్.ఎం తెలుగు తెరకు పరిచయం అవుతుంది. మిత్ర మండలి ట్రైలర్ ఆకట్టుకోగా దీపావళి కానుకగా రాబోతున్న మిగతా 3 సినిమాలకు ఇది ఏమేరకు ఫైట్ ఇస్తుందో చూడాలి.
