ప్రియదర్శి స్టైల్లో సినిమా..కానీ ఆయనకు స్టైలే లేదు!
కమెడియన్ గా పరిచయమైన ప్రియదర్శి కెరీర్ ఇప్పుడు ఎలా సాగుతుందన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 21 Nov 2025 12:23 PM ISTకమెడియన్ గా పరిచయమైన ప్రియదర్శి కెరీర్ ఇప్పుడు ఎలా సాగుతుందన్నది చెప్పాల్సిన పనిలేదు. `పెళ్లి చూపుల`తో వెలుగులోకి వచ్చిన ప్రియదర్శి అనతి కాలంలోనే బిజీ నటుడిగా మారాడు. తనదైన విలక్షణ నటనతోనే అది సాద్యమైంది. రెగ్యులర్ నటులకు భిన్నంగా ప్రియదర్శి పెర్పార్మెన్స్ ఉండటంతో? చాలా సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. స్టార్ హీరోల చిత్రాల్లోనూ కీలక భాగస్వామిగా మారాడు. దీంతో హీరోగానూ ప్రమోట్ అయ్యాడు. అలాగని హీరో పాత్రలకే పరిమితం కాలేదు. కెరీర్ ను నిలబెట్టిన పాత్రలు పోషిస్తునే ప్రధాన పాత్రల్లోనూ కొనసాగుతున్నాడు.
`మల్లేషం` ,`బలగం`,`కోర్టు` విజయం దర్శికి నటుడిగా అతడి స్థాయిని రెట్టింపు చేసిన చిత్రాలు. అప్పటికే హీరోగా కొన్నిపాత్రలు పోషించాడు. కానీ వాటితో అంతగా కనెక్ట్ కాలేదు. కానీ `కోర్టు`లో లాయర్ పాత్రతో తనదైన మార్క్ వేయడంతో ప్రియదర్శి కెరీర్ కు మరింత కలిసొచ్చింది. ఆ జానర్ చిత్రాలు ..పాత్రలకు దర్శి పర్పెక్ట్ నటుడనిపించింది. తాజాగా ప్రియదర్శి హీరోగా నటించిన`ప్రేమంటే` చిత్రం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్బంగా నటుడిగా తన ప్రయాణం ఎలా సాగుతుందన్నది రివీల్ చేసాడు.
పోషించే పాత్రలకీ..సొంత వ్యక్తిత్వానికి సంబంధం లేనప్పుడే తన నుంచి ప్రయోగాత్మక చిత్రాలు వస్తుంటా యన్నాడు. `మల్లేషం`, `బలగం`, `కోర్టు` లాంటి చిత్రాలు అలా వచ్చినవే అన్నాడు. తన ఐడియాలజీని ఎక్కడా తన పాత్రలపై రుద్దనన్నాడు. అలాంటి ఆలోచనే తన బుర్రలోకి రానివ్వనన్నాడు. చాలా మంది దర్శకులు తన వద్దకు వచ్చి మీ స్టైల్లో సినిమా చేద్దామని అడుతారన్నాడు. కానీ తనకేం స్టైల్ లేదని..మీరు తీసుకున్న పాత్రల నుంచి ఓ స్టైల్ ఉంటుందని..అలాగే ఓ సినిమా చేద్దామని చెబుతానన్నాడు. కథల విషయంలో తన ఆలోచన ఎప్పుడూ అలాగే ఉంటుందన్నాడు.
ఈ ఏడాది ప్రియదర్శి నటించిన ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో నాలుగు చిత్రాలు హీరోగా నటించినవే. అయితే వీటిలో `కోర్టు` మంచి విజయం సాధించింది. గత సినిమా `మిత్రమండలి`పై చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ వాటిని అందుకోవడంలో విఫలమైంది. రామ్ చరణ్ హీరోగానటించిన `గేమ్ ఛేంజర్` లో కీలక పాత్ర పోషించాడు. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ అయింది. అలాగే `28 డిగ్రీస్ సెల్సియస్` లో నూ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇది యావరేజ్ గా ఆడింది. త్వరలోనే `ప్రేమంటే` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
