విడాకుల తర్వాత కలిసి మళ్లీ కలిసిన జంట.. లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన డైరెక్టర్
అయితే కాలం గడిచేకొద్దీ వారి మధ్య ఉన్న దూరం తగ్గుతూ వచ్చిందని తెలుస్తోంది. సుమారు ఆరు నుండి ఎనిమిది నెలల క్రితం ఈ ఇద్దరూ మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
By: Sravani Lakshmi Srungarapu | 24 March 2026 10:49 AM ISTదశాబ్దం కిందట విడిపోయిన తర్వాత మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించిన ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ మరియు అతని మాజీ భార్య లిస్సీ లక్ష్మి పర్సనల్ లైఫ్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. 2016లో అఫీషియల్ గా విడాకులు తీసుకున్న ఈ జంట, ఇప్పుడు మళ్లీ ఒక్కటై జీవించాలనే డెసిషన్ తీసుకోవడం వారి రిలేషన్‌కు ఒక కొత్త అధ్యాయంగా భావించవచ్చు.
పిల్లల ప్రయత్నం వల్లనే!
ఈ రీయూనియన్ కేవలం సెలబ్రిటీ వార్తగానే కాకుండా, కుటుంబ బంధాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో మరోసారి తెలియచేస్తోంది. ముఖ్యంగా వారి పిల్లలైన కూతురు కళ్యాణి ప్రియదర్శన్, కొడుకు సిద్ధార్థ్ ఈ మార్పులో కీలక పాత్ర పోషించినట్లు ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు మళ్లీ దగ్గర కావాలని వారు చేసిన ప్రయత్నం వల్లనే ఆ జంట ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
2016లో విడాకులు తీసుకున్న జంట
ఇదిలా ఉండగా, 1990లో పెళ్లి చేసుకున్న ఈ జంట దశాబ్దాల పాటు కలిసి జీవించారు. కానీ, వ్యక్తిగత విభేదాలు, ముఖ్యంగా ఈగో సమస్యలు వారి సంబంధాన్ని దెబ్బతీశాయని ప్రియదర్శన్ గతంలో వెల్లడించారు. 2014లో విడాకుల ప్రక్రియ ప్రారంభమై, 2016లో అది అఫీషియల్ గా క్లోజ్ అయింది. ఆ టైమ్ లో ఈ విడాకులు ఎమోషనల్ గా, కఠినంగా అనిపించాయని లిస్సీ లక్ష్మి కూడా పేర్కొనడం గమనార్హం.
8 నెలల నుంచే కలిసి జీవించాలని నిర్ణయం
అయితే కాలం గడిచేకొద్దీ వారి మధ్య ఉన్న దూరం తగ్గుతూ వచ్చిందని తెలుస్తోంది. సుమారు ఆరు నుండి ఎనిమిది నెలల క్రితం ఈ ఇద్దరూ మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ జంట మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో లేరు. మ్యారేజ్ సర్టిఫికేట్ తప్ప మేము మళ్లీ అదే జీవితం కొనసాగిస్తున్నాం అని ప్రియదర్శన్ చెప్పడం, వారి దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
పర్సనల్ గా కలిసిన మమ్ముట్టి
ఈ పరిణామంపై సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా స్పందించారు. ముఖ్యంగా హీరో మమ్ముట్టి ఈ జంటను పర్సనల్ గా కలిసి తన ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. రీసెంట్ గా చెన్నైలోని లిస్సీ స్టూడియోలో జరిగిన ఈ సమావేశం కూడా ఈ వార్తకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. మొత్తానికి, ఇది కేవలం ఒక సెలబ్రిటీ రీయూనియన్ కథ మాత్రమే కాదు.. ఇది సెకండ్ ఛాన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ మరియు కాలంతో మారే మనుషుల ఎమోషన్స్ గురించి చెప్పే కథ.
