రెడ్ ఫ్రాక్ లో అందాల సోయగాలు..
తాజాగా తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న ఈమె అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ హ్యాపీ క్రిస్మస్ అంటూ క్యాప్షన్ జోడించింది.
By: Madhu Reddy | 26 Dec 2025 12:15 AM ISTక్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా హీరోయిన్స్ ఒకరి తర్వాత ఒకరు తమ ఇంట్లో లేదా తాము ఉండే ప్రదేశాలలో జరుపుకున్న వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక్కొక్కరు పంచుకుంటున్నారు.. ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్ ఇలా రెడ్ కలర్ దుస్తులు ధరించి తమ అందాలతో మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా తన ఇంట క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను జరుపుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రెడ్ కలర్ ఫ్రాక్ ధరించిన ఈమె.. తన అందాలతో బ్లాస్ట్ చేసింది. ముఖ్యంగా అమ్మడి అందాలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పండుగ వేళ అందాల సోయగాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఆమె ఎవరో కాదు కన్ను గీటుతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. తాజాగా తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న ఈమె అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ హ్యాపీ క్రిస్మస్ అంటూ క్యాప్షన్ జోడించింది. అందులో రెడ్ కలర్ ఫ్రాక్ తో అందాలతో ఆకట్టుకుంది. అలా మొత్తానికైతే ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
1999 అక్టోబర్ 28న కేరళలోని త్రిస్సూర్ లో పుంకున్నంలో కేంద్ర ఎక్సైజ్ శాఖ ఉద్యోగి ప్రకాష్ వారియర్ అలాగే గృహిణి ప్రియ దంపతులకు జన్మించింది. సందీపని విద్యానికేతన్ లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఈమె.. 2018లో విమల కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ కోర్సులో చేరింది. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇందులో కన్ను గీటుతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈమె నటి మాత్రమే కాదు సింగర్ కూడా..
మాణిక్య మలరాయ పూవి అనే చిత్రంలో పాట పాడి సింగర్ గా కూడా సత్తా చాటింది. ఇక 2019లో నరేష్ అయ్యర్ తో కలిసి ఫైనల్స్ చిత్రం కోసం ఒక పాట కూడా పాడింది. అలాగే అర్బాజ్ ఖాన్ తో కలిసి హిందీ చిత్రమైన శ్రీదేవి బంగ్లాలో కూడా నటించింది. ఇక 2021 లో చెక్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్ లతో కలిసి తేనె పట్టుకునే అమ్మాయి పాత్రలో నటించింది.
2025లో కన్నడ చిత్రం విష్ణుప్రియలో కూడా నటించింది. ఇదే ఆమెకు తొలి కన్నడ చిత్రం కూడా కావడం గమనార్హం.
లవ్ హ్యాకర్స్ అనే చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఇలా పండుగను పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకోవడం నిజంగా విశేషం అని చెప్పాలి.
