Begin typing your search above and press return to search.

దీపావ‌ళి ముందు దివ్వెలా వెలిగిపోతున్న‌ వింక్ గాళ్

ముఖ్యంగా సోష‌ల్ మీడియాల్లో వింక్ బ్యూటీ స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇన్ స్టా మాధ్య‌మంలో నిరంత‌ర ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అగ్గి రాజేస్తోంది.

By:  Sivaji Kontham   |   8 Oct 2025 9:59 AM IST
దీపావ‌ళి ముందు దివ్వెలా వెలిగిపోతున్న‌ వింక్ గాళ్
X

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ద‌క్షిణాది అంత‌టా అవ‌కాశాలు అందుకుంటోంది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. ఒకే ఒక్క వింక్‌తో ల‌క్ష‌లాదిగా కుర్ర‌కారు హృద‌యాల‌ను దోచుకున్న ఈ బ్యూటీ ఏం చేస్తున్నా అంద‌రి దృష్టి అటువైపే ఉంటోంది. కెరీర్ ప్రారంభించిన ఐదారేళ్ల త‌ర్వాత కూడా వింక్ గాళ్ విన్యాసాల గురించి యూత్ మ‌ర్చిపోలేదంటే త‌న‌కు క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌నే అర్థం.

ముఖ్యంగా సోష‌ల్ మీడియాల్లో వింక్ బ్యూటీ స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇన్ స్టా మాధ్య‌మంలో నిరంత‌ర ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అగ్గి రాజేస్తోంది. ఈసారి దీపావ‌ళి కాన్సెప్టుతో అభిమానుల ముందుకు వ‌చ్చింది. ట్రెడిష‌న‌ల్ బ్లూ లెహంగా ధ‌రించిన ప్రియా ప్ర‌కాష్ దీపంలా వెలిగిపోతోంది. అలా అందంగా న‌వ్వేస్తూ అరిచేతిలో దివ్వెతో క‌నిపించింది. వెండితో ఎంబ్రాయిడరీ చేయబడిన నీలిరంగు లెహంగా.. కాంబినేష‌న్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ - దుపట్టాతో ప్రియా ఎంతో అందంగా క‌నిపిస్తోంది.

పండ‌గ‌ కాన్సెప్టును బ‌ట్టి అంద‌మైన దుస్తులు ధ‌రించడం ప్రియా ప్రకాష్ అల‌వాటు. ఇంత‌కుముందు ద‌స‌రా వేళ దాండియా ఆడే పెళ్లికూతురులా క‌నిపించింది. ఇప్పుడు దీపావ‌ళికి దీప‌పు కాంతుల‌ను వెద‌జ‌ల్లే దివ్వెలా మారిపోయింది. చేతుల‌కు డిజైన‌ర్ గాజులు, చెవుల‌కు అంద‌మైన‌ లోలాకులు ట్రెడిష‌న్ ని మ‌రింత అందంగా ఇనుమ‌డింప‌జేసాయి. ప్ర‌స్తుతం ఈ అంద‌మైన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో యువ‌త‌రం మ‌న‌సుల‌ను గెలుచుకుంటోంది. ఎంపిక చేసుకున్న లెహంగా సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించినా ప్రియాలోని అందాల‌ను బోల్డ్ గా ఎలివేట్ చేసింద‌ని కితాబిచ్చేస్తున్నారు. దీపావ‌ళి ముందే దీప‌పు కాంతులు వెద‌జ‌ల్లుతోంద‌ని ప్ర‌శంసిస్తున్నారు. ప్ర‌తిసారీ సంథింగ్ ఏదైనా స్పెష‌ల్ గా ఆవిష్క‌రించిన‌ప్పుడే పొగ‌డ్త‌లు అందుతాయి. ఇప్పుడు ప్రియా కూడా అలాంటి ప్ర‌శంస‌ల్ని ఆస్వాధిస్తోంది.

ప్రియా ప్ర‌కాష్ ఇటీవ‌ల `గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రంలో న‌టించింది. ఆ త‌ర‌వాత మ‌రో పెద్ద సినిమాని ప్ర‌క‌టించ‌లేదు. ఈ బ్యూటీ న‌టించిన‌ మలయాళ చిత్రం `కొల్లా` (2023) రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలో విడుద‌లై అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రానికి సూరజ్ వర్మ దర్శకత్వం వహించారు.