Begin typing your search above and press return to search.

బర్త్ డే స్పెషల్.. ఆకట్టుకుంటున్న ప్రియా ప్రకాష్ వారియర్!

అందులో భాగంగానే పింక్ కలర్ ఫ్రాక్ లో అందాలు ఆరబోస్తూ చాలా గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది.

By:  Madhu Reddy   |   29 Oct 2025 9:36 PM IST
బర్త్ డే స్పెషల్.. ఆకట్టుకుంటున్న ప్రియా ప్రకాష్ వారియర్!
X

ప్రియా ప్రకాష్ వారియర్.. కన్నుగీటుతూ ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన నటనతో.. అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ఈమె.. అటు గ్లామర్ షో చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే నిన్న ప్రియా ప్రకాష్ వారియర్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆమె మిత్రుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే పింక్ కలర్ ఫ్రాక్ లో అందాలు ఆరబోస్తూ చాలా గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోతో పాటు ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా తాజాగా పంచుకోవడంతో ఈ విషయం తెలిసి అభిమానులు, నెటిజన్లు ప్రియా ప్రకాష్ వారియర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ కు సంబంధించిన ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రియా ప్రకాష్ వారియర్ 'ఒరు ఆదర్ లవ్' సినిమాలో కన్ను గీటు వీడియోతో కొన్ని సెకన్ల వ్యవధిలోనే నెట్టింట సంచలనం సృష్టించింది. ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ హోదాను దక్కించుకున్న ఈమె అప్పట్లో వైరల్ అవ్వడమే కాకుండా కుర్రకారుకు ఫేవరెట్ హీరోయిన్గా కూడా మారిపోయింది. ఈ వీడియోతో ఈమెకు టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి.. అయితే ఈమె మాత్రం ఏది పడితే అది చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తూ కథలను ఎంపిక చేసుకుంటోంది. తొలిసారి నితిన్ హీరోగా వచ్చిన చెక్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఈ సినిమా తర్వాత మళ్లీ మలయాళంలో బిజీగా మారిపోయింది. తెలుగులో చాలాకాలం తర్వాత మెగా మల్టీస్టారర్ మూవీ 'బ్రో' సినిమాలో నటించినది. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటించింది. ఇందులో అజిత్ కుమార్ కూడా నటించారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ పరవాలేదు అనిపించుకుంది. అలాగే బాలీవుడ్లో త్రీ మంకీస్, లవ్ హ్యాకర్ వంటి చిత్రాలలో నటించిన ఈమె కన్నడ చిత్రం విష్ణు ప్రియ వంటి ప్రాజెక్టులో కూడా ప్రస్తుతం బిజీగా ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అటు క్రేజీ ఫోటోషూట్స్ తో ఇటు డాన్స్ వీడియోలతో ఆకట్టుకునే ఈమె.. ఇటీవల ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ సినిమాలో పాట పాడి తన గాత్రంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.