Begin typing your search above and press return to search.

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

'ఇరుముడి' సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ప్రియా భవానీ శంకర్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియుడు రాజ్‌వేల్ రాజ్‌తో కలిసి ఆమె షేర్ చేసిన ఫోటోలు పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయనే చర్చకు దారితీశాయి. పదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట నుంచి పెళ్లిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

By:  Ramesh Palla   |   10 Nov 2026 6:19 PM IST
ఇరుముడి కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?
X

రవితేజ హీరోగా నటించిన 'ఇరుముడి' బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో కావేరి పాత్రలో నటించిన హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌ కి మంచి గుర్తింపు లభించింది. అంతకు ముందు టాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు ఇరుముడి సినిమాతో దక్కింది. రవితేజకు సరి జోడీగా, పదేళ్ల పాపకు తల్లి పాత్రలో ప్రియా భవానీ శంకర్‌ లుక్స్‌తోనూ మెప్పించింది. సాధారణంగా హీరోయిన్స్ గ్లామర్‌ పాత్రలు చేస్తేనే, స్కిన్‌ షో చేస్తేనే గుర్తింపు దక్కించుకుంటారని, కమర్షియల్‌ రోల్స్ లో నటిస్తేనే ప్రేక్షకుల ఆధరణ దక్కించుకుంటారని అంటారు. కానీ ప్రియా భవానీ శంకర్ మాత్రం కావేరి పాత్రతోనూ మెప్పించింది. టాలీవుడ్‌లో ప్రియా భవానీకి మరిన్ని మంచి సినిమాల్లో ఆఫర్లు వస్తాయని అంతా భావించారు.





టాలీవుడ్‌లో ఇరుముడి సినిమాతో ఎంట్రీ....

తమిళ్‌ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్‌లోనూ ఫైనల్‌గా ఇరుముడి సినిమాతో హిట్‌ దక్కించుకుంది. ఇక టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తుందని, ఆమె కొత్త సినిమా అప్‌డేట్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి షాక్‌ ఇస్తూ పెళ్లి అప్‌డేట్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో ప్రియా భవానీ శంకర్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. మెడలో పూల దండలు, పక్కన ప్రియుడు కూర్చుని ఉండటంతో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి అనే చర్చ మొదలైంది. ప్రియా భవానీ శంకర్‌ ఈ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా తన పెళ్లి నిశ్చితార్థం జరిగిందని చెప్పకనే చెబుతుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఈ ఫోటోలు ఫ్రీ వెడ్డింగ్‌ కు సంబంధించినవి అయ్యి ఉంటాయని కొందరు మాట్లాడుతున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో ప్రియా భవానీ శంకర్‌ ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

రాజ్‌వేల్‌ తో ప్రియా భవానీ శంకర్‌ వివాహం...

హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలోనే ప్రియా భవానీ శంకర్‌ ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. తమిళ మీడియాలో చాలా రోజులుగా ప్రముఖంగా ఈమె ప్రేమ విషయమై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఫైనల్‌గా ప్రియుడు రాజ్‌వేల్‌ రాజ్‌ తో పెళ్లికి ప్రియా భవానీ శంకర్ రెడీ అయిందని తేలిపోయింది. ఇప్పటి వరకు ఈ జంట నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ వీరి పెళ్లికి సంబంధించినంత వరకు ఏర్పాట్లు ప్రారంభం అయినట్లే అని ఈ ఫోటోలు చూస్తే అనిపిస్తోంది. ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో భాగంగా ప్రియా భవానీ శంకర్‌, రాజ్‌వేల్‌ రాజ్‌ ఈ ఫోటోలు తీసుకుని ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పెళ్లి ఎప్పుడు, ఎందుకు అంత సీక్రెట్‌ గా పెళ్లి వ్యవహారంను ఉంచుతున్నారు అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

ఇండియన్‌ 3 లో ప్రియా భవానీ...

పదేళ్లుగా రిలేషన్‌లో ఉన్న రాజ్‌వేల్‌, ప్రియా భవానీ శంకర్‌ లు నాలుగు ఏళ్ల క్రితం ఒక ఇల్లు కొన్నట్లుగా ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇద్దరూ అత్యంత ఖరీదైన ఏరియాలో తమ పెళ్లి తర్వాత నివాసం ఉండటం కోసం కొనుగోలు చేశారని ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఆ డ్రీమ్‌ హౌస్‌ ను భారీ మొత్తం ఖర్చు చేసి, హంగులు దిద్దినట్లుగా కూడా తమిళ మీడియా వర్గాల్లో కథనాలు వచ్చాయి. మొత్తానికి వీరిద్దు ఇల్లు కొనుగోలు చేసి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ ఫోటోలతో పెళ్లి వేడుక ప్రారంభం అయిందని, ముందు ముందు ప్రియా భవానీ నుంచి మరిన్ని పెళ్లి ఫోటోలు వస్తాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రియా భవానీ రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ 3 లోనూ ఈమె కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. పెళ్లి తర్వాత ఈమె తెలుగులో మళ్లీ నటించే అవకాశం ఉందా అనేది చూడాలి.