Begin typing your search above and press return to search.

పృథ్వీరాజ్ సినిమా.. పెద్ద కష్టమే వచ్చిపడింది..!

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ లో లేటెస్ట్ గా వస్తున్న సినిమా విలాయత్ బుద్ధా.

By:  Ramesh Boddu   |   18 Nov 2025 10:54 AM IST
పృథ్వీరాజ్ సినిమా.. పెద్ద కష్టమే వచ్చిపడింది..!
X

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ లో లేటెస్ట్ గా వస్తున్న సినిమా విలాయత్ బుద్ధా. ఈ సినిమాను మలయాళ రైటర్ జీ.ఆర్ ఇందు గోపాలన్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించిన సినిమా. ఐతే ఈ సినిమాను అసలైతే అయ్యప్పనుం కోషియం డైరెక్టర్ సాచి డైరెక్ట్ చేయాలని అనుకున్నారు. ఐతే ఆయన మరణానంతరం ఆ సినిమా సాచి దగ్గర అసిస్టెంట్ గా చేసిన జయన్ నంభియార్ తీసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమార్ లీడ్ రోల్ లో జయన్ నంభియార్ డైరెక్షన్ లో విలాయత్ బుద్ధా సినిమా తెరకెక్కింది.

హీరో గంధపు చెక్కల స్మగ్లర్..

నవంబర్ 21న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఐతే ఈ ట్రైలర్ చూస్తే సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతోనే వస్తుందని అనిపిస్తుంది. సినిమా ట్రైలర్ చూడగానే హీరో గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపిస్తాడు. అందుకే ఆయన్ను డబల్ మోహన్ అంటుంటారు. అతని కన్ను పడితే కచ్చితంగా అది స్మగుల్ అవ్వాల్సిందే. ఐతే ఈ టైంలో ఒక ఇంటి పెరడులో ఉన్న గంధపు చెట్టుని మాయం చేస్తాడు. ఇది డబల్ మోహన్ పనే అని అందరు అనుకుంటారు.

ఆ పనిలో తనని మించిన వారు లేరనే విధంగా పేరు తెచ్చుకున్న హీరో మోహన్ అటు ఊరి పెద్దతో పాటు పోలీసులను ఎలా ఎదురించాడు అన్నది విలాయత్ బుద్ధ కథ. ఐతే ఈ ట్రైలర్ చూస్తే అటు ఇటుగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకు దగ్గర పోలిక ఉన్నట్టు ఉంటుంది. ఐతే పుష్ప సినిమాలో లా హీరోకి ఎలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉండదు. ముఖ్యంగా ఇది ఎస్పీ, పుష్ప ఈగో ఫైట్ కాదు. సో పుష్ప లో హీరో.. విలాయత్ బుద్ధాలో హీరో స్మగ్లింగ్ చేస్తారన్న కామన్ రీజన్ తప్ప రెండు సినిమాల కథ వేరేలా ఉంది.

పృథ్వీరాజ్ విలాయత్ బుద్ధా.. అల్లు అర్జున్ పుష్ప..

కానీ విలాయత్ బుద్ధా సినిమా ట్రైలర్ చూసిన చాలామంది పుష్ప సినిమా స్పూర్తితో తీశారని అనుకుంటున్నారు. అసలైతే ఈ సినిమా 2020లోనే మొదలైంది. అప్పటికి పుష్ప రాలేదు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ట్రైలర్ లో పుష్ప కాదని అనిపించినా సినిమా చూశాక మరింత వ్యత్యాసాలు ఉండే ఛాన్స్ ఉంది. మరి ఈ విలాయత్ బుద్ధా డబల్ మోహన్ ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తాడన్నది చూడాలి. రీసెంట్ గా మహేష్ వారణాసి ఈవెంట్ లో తను పోషించే కుంభ రోల్ గురించి చెప్పడమే కాదు రాజమౌళి నరేషన్.. మహేష్ కోపరేషన్ గురించి చెప్పి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు పృథ్వీరాజ్.

తను ఓ పక్క యాక్టింగ్ చేస్తూనే మలయాళంలో తన డైరెక్షన్ లో కూడా అదరగొట్టేస్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆల్రెడీ తెలుగులో సలార్ సినిమాలో వరద రాజ మన్నార్ పాత్రలో మెప్పించిన అతను సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక వారణాసిలో కుంభ పాత్రలో తన సత్తా చాటనున్నాడు పృథ్వీరాజ్.