Begin typing your search above and press return to search.

పృథ్వీరాజ్ అస‌లు ప్లాన్ అదేనా?

మలయాళ సినీ పరిశ్రమలో పృథ్వీరాజ్ సుకుమారన్ జ‌ర్నీని గమనిస్తే.. ఆయన కెరీర్‌ను కేవలం హీరోగా వచ్చిన స‌క్సెస్‌లు, ఫ్లాపుల‌తో కొలవడం అంత ఈజీ కాదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 Sept 2026 9:00 PM IST
పృథ్వీరాజ్ అస‌లు ప్లాన్ అదేనా?
X

మలయాళ సినీ పరిశ్రమలో పృథ్వీరాజ్ సుకుమారన్ జ‌ర్నీని గమనిస్తే.. ఆయన కెరీర్‌ను కేవలం హీరోగా వచ్చిన స‌క్సెస్‌లు, ఫ్లాపుల‌తో కొలవడం అంత ఈజీ కాదు. ఒకవైపు స్టార్ హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు డైరెక్ట‌ర్ గా మెగాఫోన్ పట్టడం, నిర్మాత‌గా నిర్మాణ బాధ్యతలు చేపట్టడం ఆయన కెరీర్‌ను మిగతా హీరోలతో పోలిస్తే భిన్నంగా మార్చింది. ఇప్పుడు ఆ పరిధి మలయాళ సినిమాలను దాటి తెలుగు, బాలీవుడ్ ఇండ‌స్ట్రీల వరకు విస్తరిస్తోంది. దీంతో పృథ్వీరాజ్ స్టార్‌డమ్‌ను కాపాడుకునే ప్రయత్నం కంటే దాన్ని మరింత విస్తరించుకునే స్ట్రాట‌జీతో ముందుకెళ్తున్నార‌నే డిస్క‌ష‌న్ మొదలైంది.

ఒకే తరహా హీరో ఇమేజ్‌కు పరిమితం కాకుండా పృథ్వీరాజ్ ఎప్పటికప్పుడు తన పాత్రల పరిధిని మార్చుకుంటూ వస్తున్నారు. మలయాళంలో హీరోగా కనిపించిన ఆయన.. ఇతర భాషల్లో మాత్రం కథకు కీలకమైన పాత్రలు, విల‌న్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తెలుగు సినిమాల్లో భారీ ప్రాజెక్టులను ఎంచుకోవడం, హిందీ సినిమాల్లోనూ తన ఉనికిని చాటుకోవడం ద్వారా భాషల హద్దులు దాటే నటుడిగా తన స్థానాన్ని బలపరుచుకుంటున్నారు. హీరోగా చేసిన సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మరో భాషలో మరో రకమైన పాత్రను ఎంచుకునే స్వేచ్ఛ ఆయన కెరీర్‌కు ప్రత్యేకతగా మారుతోంది.

ఇక పృథ్వీరాజ్ జ‌ర్నీలో మరో కీలకమైన అంశం ఆయన మేకింగ్ కూడా. నటుడిగా కెమెరా ముందు కనిపించడమే కాకుండా డైరెక్ట‌ర్ గా కథను నడిపించగలగడం, నిర్మాతగా ప్రాజెక్ట్‌పై డెసిష‌న్స్ తీసుకోవడం ఆయనకు ఎక్స్‌ట్రా స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. అందుకే ఆయ‌న న‌టించిన ప‌లు సినిమాలు వ‌రుస ఫ్లాపుల‌వుతున్నాఆయనకు మరో దిశలో కొనసాగేందుకు అవకాశాలుంటున్నాయి. ఒకే మార్కెట్ లేదా ఒకే ఇమేజ్‌పై ఆధారపడకుండా కెరీర్‌ను అనేక విభాగాలుగా విస్తరించుకోవడం వల్లే ఈ స్థిరత్వం కనిపిస్తోందనే అభిప్రాయం ఉంది.

ప్రస్తుతం తెలుగు సినిమాల్లోనూ కీలక ప్రాజెక్టులతో కనిపించబోతున్న పృథ్వీరాజ్‌కు వారణాసిలో కుంభ పాత్రపై ఆసక్తి నెలకొంది. నాని- సుజిత్ కాంబోలో రానున్న బ్లడీ రోమియో తోనూ ఆయన మరో భిన్నమైన స్పేస్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పృథ్వీరాజ్ తదుపరి అడుగు ఏ భాషలో, ఏ పాత్రలో, ఏ రూపంలో ఉంటుందనేదే ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే.. తనకు ఇప్పటికే ఉన్న స్టార్ ఇమేజ్‌ను కాపాడుకోవడం కంటే, నటుడిగా తన పరిధిని విస్తరించడమే పృథ్వీరాజ్ సుకుమారన్ అసలు గేమ్ ప్లాన్‌గా కనిపిస్తోంది.