#GlobeTrotterEvent - నా పాతికేళ్ల కెరీర్‌లో ఇలాంటిది చేయలేదు: పృథ్వీరాజ్ సుకుమారన్
``గత పాతికేళ్లలో చాలా సానిమాలు చేసాను. కానీ ఇంత పెద్ద సినిమాలో చేయలేదు. నా పాత్ర కుంభను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్ది తెరపై ప్రెజెంట్ చేసారు`` అని అన్నారు పృథ్వీరాజ్ సుకుమారన్.
By: Sivaji Kontham | 16 Nov 2025 9:19 AM IST``గత పాతికేళ్లలో చాలా సానిమాలు చేసాను. కానీ ఇంత పెద్ద సినిమాలో చేయలేదు. నా పాత్ర కుంభను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్ది తెరపై ప్రెజెంట్ చేసారు`` అని అన్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. మహేష్- రాజమౌళి చిత్రం వారణాసిలో విలన్ గా నటించిన పృథ్వీరాజ్ టాలీవుడ్ లో ఇంత భారీ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రామోజీ ఫిలింసిటీలో టైటిల్ లాంచ్ వేడుకలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ ...కుంభను అద్భుతంగా పరిచయం చేసిన కీరవాణికి ధన్యవాదాలు తెలిపారు. ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చారు... సినిమాలపై తెలుగు ప్రేక్షకుల ప్రేమను ఇది ప్రత్యక్షంగా చెబుతోంది.
కొన్ని సంవత్సరాల క్రితం నేను స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. ఆ సమయంలో రాజమౌళి గారి నుంచి మెసేజ్ వచ్చింది. నా సినిమాలో విలన్ పాత్ర బాగా వస్తోంది.. మీకు బావుంటుంది.. చేస్తారా? అని నాకు ఒక మెసేజ్ వచ్చింది. నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది...ఆ తర్వాత ఆయన ఆఫీస్ కి వచ్చాను. అప్పటికే నా స్నేహితుడు ప్రభాస్ చెప్పారు రాజమౌళి గారి గురించి .. 5 నిమిషాలు ఈ కథ విన్నాను. నేను కథ వినేప్పుడు ఒక చిన్న పిల్లాడిని అయిపోయాను. ఈ సినిమా స్కేల్, విజన్, యాంబిషన్ .. భారతదేశంలో ఇప్పటివరకూ చూడనిది.
దర్శకుడు రాజమౌళి నెవ్వర్ బిఫోర్ విజువల్స్ ని చూపిస్తున్నారు. ఇంత పెద్ద స్కేల్ లో ఇలా పిక్చరైజ్ చేయడం ఇదే మొదటిసారి చూస్తున్నా..ప్రతి నటుడు లైఫ్ టైమ్ లో ఒకసారి అయినా రాజమౌళి దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చారు ఆయన. ఎమోషనల్లీ ఫిజికల్లీ ఛాలెంజింగ్ పాత్రను ఆయన క్రియేట్ చేసి నన్ను నమ్మి అవకాశమిచ్చారు. నన్ను సెట్లో బాగా టార్చర్ చేసినా కానీ ఆయనకు ధన్యవాదాలు.. అనిఅన్నారు.
నేను చూసిన మొదటి తెలుగు సినిమా పోకిరి. అప్పటి నుంచి ఇప్పటివరకూ మహేష్ సర్ బిల్డ్ చేసిన లెగసీ నాకు స్ఫూర్తినిస్తుంది. ఒక సూపర్ స్టార్ గా మీరు ప్రతిదీ సాధించారు.. దీనికి మీరు అర్హత సాధించారని మహేష్ ని ప్రశంసించారు. అలాగే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మందాకిని గా అద్భుతంగా నటించారని పృథ్వీ కితాబిచ్చారు.
భారతీయ సినిమాని మరోసారి రాజమౌళి ప్రపంచ స్థాయికి చేరుస్తున్నారని కొనియాడారు. ఆయన గత చిత్రాల కంటే వారణాసి చిత్రం ఎక్కువ మందికి చేరుతుందని కూడా అన్నారు.
