వారణాసి.. 'కుంభ' ఉద్దేశమేమిటి?
నిజానికి.. పృథ్వీరాజ్ కెరీర్ లోనే ది గోట్ లైఫ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రమని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
By: M Prashanth | 4 Feb 2026 10:46 PM ISTదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మూవీలో మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వారణాసిలో ఆయన కుంభ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే పృథ్వీరాజ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆయన రోల్ పై బజ్ కూడా క్రియేట్ అయింది.
అయితే వారణాసి టీమ్ తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కెరీర్ లో కుంభ పాత్ర.. విభిన్నమైన రోల్ గా చెప్పారు. ఎవరూ అంచనా వేయలేనిదని పేర్కొన్నారు. పూర్తిగా గ్రే షేడ్స్ తో తన క్యారెక్టర్ సాగుతుందని చెప్పిన ఆయన.. సినిమాలో ఎప్పుడు ఏం చేస్తానో ప్రేక్షకులు ఊహించలేని విధంగా జక్కన్న పాత్రను డిజైన్ చేసినట్లు వెల్లడించారు.
ఆ తర్వాత.. వారణాసి కాకుండా కెరీర్ లో ఎక్కువగా నేర్పిన సినిమా ఏది అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు పృథ్వీరాజ్ వెంటనే.. ది గోట్ లైఫ్ మూవీ అని ఆన్సర్ ఇచ్చారు. ఆ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పిన ఆయన.. నటుడిగా చాలా నేర్పిందని చెప్పారు. అదే పలుమార్లు రిపీట్ చేసిన పృథ్వీరాజ్.. ఆ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోందని ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా ఆ సినిమాపై నెట్టింట చర్చ మొదలైంది.
నిజానికి.. పృథ్వీరాజ్ కెరీర్ లోనే ది గోట్ లైఫ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రమని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. బెన్నీ డానియల్ (బెన్యామిన్) రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డు అందుకున్న బ్లెస్సీ దర్శకత్వం వహించారు. అయితే సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా కష్టపడ్డారు. ఏకంగా 16 ఏళ్ల పాటు దీని కోసం శ్రమించారు.
సినిమాలో నజీబ్ రోల్ లో ఒదిగిపోవడం కోసం ఏకంగా 31 కిలోల బరువు తగ్గారు. 72 గంటల పాటు భోజనం లేకుండా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగి ఆయన షూట్ లో పాల్గొన్నారు. 2009లో ప్రకటించిన ఆ ప్రాజెక్ట్ 2018లో షూటింగ్ ప్రారంభమై, 2024లో థియేటర్లలో విడుదలైంది. దాదాపు 16 ఏళ్ల ప్రయాణం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి మంచి కలెక్షన్లు సాధించింది. పృథ్వీరాజ్ కష్టానికి ఫలితం దక్కిందని చెప్పాలి. అనేక మంది ఆయన యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు హాలీవుడ్ మీడియా వేదికగా ది గోట్ లైఫ్ ఓటీటీలో పృథ్వీరాజ్ ఉందని చెప్పడం గమనార్హం కొంతమంది నెటిజన్లు దాన్ని ట్రోల్ చేస్తూ ప్రమోషన్ అంటున్నా.. మరికొందరు మాత్రం ఆయన కష్టానికి ఇది తగిన గుర్తింపును ప్రస్తావించారని అంటున్నారు. ఏదేమైనా కుంభ ఉద్దేశ్యం ఆయనకే తెలియాలి.
