Begin typing your search above and press return to search.

'వార‌ణాసి' స్టార్ పృథ్వీరాజ్‌పై షాకింగ్ క్రిటిసిజం

మొత్తానికి వర్సటైల్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ నుంచి ఇలాంటి రొటీన్ మాస్ కమర్షియల్ సినిమా రావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

By:  Sivaji Kontham   |   21 Aug 2026 8:32 AM IST
వార‌ణాసి స్టార్ పృథ్వీరాజ్‌పై షాకింగ్ క్రిటిసిజం
X

మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవ‌ల పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు మోహ‌న్ లాల్, చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ల సినిమాల్లో న‌టించాడు. ఇప్పుడు ఏకంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్‌- రాజ‌మౌళి కాంబినేష‌న్ లోని భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీ `వార‌ణాసి`లో న‌టిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. అయితే వార‌ణాసి గురించి ముచ్చ‌టిస్తున్న ఈ స‌మ‌య‌లో పృథ్వీరాజ్ కథానాయకుడిగా నటించిన `ఖలీఫా` మూవీపై క్రిటిసిజం వేడెక్కిస్తోంది.

ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ సినిమా విడుదలైన తొలి షో నుంచే నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మునుపు ట్రైలర్ వచ్చినప్పుడే విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చాక ప్రథమార్థం నుంచే తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నెటిజన్లు రివ్యూలు ఇచ్చారు. మేకర్స్ విజువల్స్ పరంగా సినిమాను ఎంత స్టైలిష్‌గా తీర్చిదిద్దినా పాతబడిన కథ, పేలవమైన స్క్రీన్‌ప్లే కారణంగా ఇది బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచిందని ప్రేక్షకులు తెగేసి చెప్తున్నారు.

ఈ సినిమాపై వచ్చిన ప్రధాన ఫిర్యాదులలో కథా వేగం ఒకటి. సినిమా అసలు కథలోకి వెళ్లడానికి దాదాపు 40 నిమిషాల సమయం తీసుకుందని.. పాత్రల మధ్య ఎలాంటి ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌గా మారిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. రొటీన్ స్మగ్లింగ్ అండ్ రివేంజ్ డ్రామాతో రూపొందించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫిజిక్ .. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే కాస్త ఊరటనిచ్చాయి. పాయింట్ పరంగా ఇంటర్‌వెల్ బ్లాక్, అలాగే మోహన్‌లాల్ లాంటి నటుల క్యామియో రోల్స్ కాస్త ఆకట్టుకున్నా సుదీర్ఘంగా సాగే సెకండ్ హాఫ్ ప్రేక్షకులను తీవ్రంగా విసిగించిందని పెదవి విరుస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ చిత్రంపై కామెంట్ల వర్షం కురుస్తోంది. అప్‌క‌మ్ హీరోలు కూడా రిజెక్ట్ చేసేంత ఔట్ డేటెడ్ కథతో పృథ్వీరాజ్ ఈ సినిమా చేయడం ఏంటని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. ఇది 1999లో వచ్చి ఉంటే కూడా జస్ట్ యావరేజ్ అయ్యేదని.. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లౌడ్‌గా.. రొటీన్‌గా ఉండి ఆకట్టుకోలేకపోయిందని పెదవి విరిచారు. జెమిని టీవీ, మా టీవీల్లో నిత్యం వచ్చే పాతకాలం టీవీ సినిమాల లెవెల్ స్టోరీ లైన్ అని ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఎద్దేవా చేశారు.

ఇంతకుముందు పృథ్వీరాజ్ తీసిన `కడువ` వంటి మాస్ కమర్షియల్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయని... ఆయనకు ఇలాంటి ఫార్ములా పాత్రలు అసలు సెట్ అవ్వవని సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమ క్రైమ్ థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేషన్ డ్రామాలు, గ్రామీణ నేపథ్యం ఉన్న కథలను అద్భుతంగా తీయగలదు కానీ ఇలాంటి ప్రాపర్ మాస్ కమర్షియల్ సినిమాలను తీయడంలో తరచుగా తడబడుతుందని విశ్లేషిస్తున్నారు. అడ్వాన్స్ రూపంలో కమిట్‌మెంట్స్ ఉండటం వల్లే పృథ్వీరాజ్ ఇలాంటి బలహీనమైన స్క్రిప్టులను ఎంచుకుంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు.

మొత్తానికి వర్సటైల్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ నుంచి ఇలాంటి రొటీన్ మాస్ కమర్షియల్ సినిమా రావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూలు, నెగెటివ్ టాక్ చూస్తుంటే `ఖలీఫా` ప్రేక్షకులకు ఒక పెద్ద `స్కిప్ మూవీ` అనే వార్నింగ్‌లా మారింది. మంచి కథలను ఎంచుకోవడంలో పేరుగాంచిన పృథ్వీరాజ్ త‌దుప‌రి ప్రాజెక్టుల్లోనైనా బలమైన స్క్రిప్టులను ఎంచుకుని తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఖ‌లీఫాను విమ‌ర్శిస్తూనే... రాజ‌మౌళి- మ‌హేష్ ల‌తో `వార‌ణాసి` అత‌డి కెరీర్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్ల‌గ‌ల‌ద‌ని కూడా ఫ్యాన్స్ ప్ర‌త్యేకంగా విష్ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రం.