దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లలో కస్టమ్స్ సోదాలు!
ఇందులో భాగంగా కొచ్చి, తిరువనంతపురం, మలప్పురం,కోజికోడ్, త్రిస్పూర్, కుట్టిపురం సహ దాదాపు 30 ప్రదేశాలలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో
By: Madhu Reddy | 23 Sept 2025 3:00 PM ISTప్రముఖ మలయాళ హీరోలు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దానికి కారణం భూటాన్ నుండి 100 కంటే ఎక్కువ లగ్జరీ వాహనాలను అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలు ఎదురయ్యాయి. అయితే ఈ ఆరోపణలు కఠిన చర్యలుగా తీసుకున్న కస్టమ్స్ అధికారులు వెంటనే కేరళలోని ప్రముఖ నటీనటులు, పారిశ్రామికవేత్తలతో సహా ఎక్కువ ఆస్తి కలిగిన వ్యక్తుల ఇళ్లలో, వారి ఆఫీసులపై రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు.. "ఆపరేషన్ నుమ్ ఖోర్" పేరుతో కేరళ వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
విషయం ఏమిటంటే.. పన్ను తప్పించుకునేందుకు.. భూటాన్ నుండి అక్రమంగా లగ్జరీ వాహనాలను దిగుమతి చేసి.. సెకండ్ హ్యాండ్ వాహనాలుగా చెప్పి కేరళకు తీసుకొచ్చారనే సమాచారం అందడంతోనే ఇప్పుడు కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే అలా భూటాన్ నుండి వచ్చిన వాహనాలను ట్రాక్ చేయగా.. విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అందులో భాగంగానే ఇప్పుడు కస్టమ్స్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కొచ్చి, తిరువనంతపురం, మలప్పురం,కోజికోడ్, త్రిస్పూర్, కుట్టిపురం సహ దాదాపు 30 ప్రదేశాలలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొచ్చిలో ఉండే ప్రముఖ మలయాళ స్టార్స్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ ఇళ్లలో కూడా కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు..
ఇండియన్ చట్టం ప్రకారం.. సెకండ్ హ్యాండ్ వాహనాల దిగుమతిని నిషేధించారు. కానీ మోటార్ వాహనాల శాఖ పరివాహన వెబ్సైట్లో నకిలీలతో సహా 10 నుండి 15 కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారుల దృష్టికి వచ్చిందట.. ఇందులో భాగంగా తనిఖీలు చేయగా.. ఈ వాహనాల్లో ఏవి కూడా భారతదేశంలో తయారు చేయబడలేదని గుర్తించారు. కొత్త వాహనాలను భూటాన్ నుండి దిగుమతి చేసి సెకండ్ హ్యాండ్ వాహనాలు అని నమ్మించి అక్రమంగా దిగుమతి చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే అక్రమంగా దిగుమతి చేసుకున్న ఈ వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలను సమర్పించాలని.. నేరం రుజువైతే అర్హులు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని కఠినమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.
అలా కేరళ వ్యాప్తంగా ప్రముఖుల ఇళ్లలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ పై గతంలో కూడా ఒక ఆరోపణ ఉంది.అదేంటంటే లంబోర్గినీ కారు కొని పుదుచ్చేరిలో రిజిస్టర్ చేసి పన్ను ఎగ్గొట్టారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. అందుకే ఈ హీరో పై కస్టమ్స్ అధికారులకు అనుమానం కలిగినట్లు తెలుస్తోంది. మరి కస్టమ్స్ అధికారుల సోదాల తర్వాత ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి.
