Begin typing your search above and press return to search.

ఆరు నెలలకే ముగిసిన బంధం!

నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల వ్యవధిలోనే జంట పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకోవడం క్రీడా, వినోద రంగాల్లో చర్చనీయాంశంగా మారింది.

By:  Srikanth Kontham   |   17 Sept 2026 7:32 PM IST
ఆరు నెలలకే ముగిసిన బంధం!
X

యువ క్రికెటర్ పృథ్వీ షా- నటి , సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్ త‌మ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల వ్యవధిలోనే జంట పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకోవడం క్రీడా, వినోద రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బ్రేకప్ వార్తను ఆకృతి అగర్వాల్ సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ధ్రువీకరించారు.

తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆకృతి ఓ భావోద్వేగపూరిత ప్రకటనను పంచుకుంటూ ఇద్దరి దారులు వేరని అంగీకరించక తప్పడం లేదని పేర్కొన్నారు. `మేము ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నా? గౌరవించుకున్నా? మా ప్రయాణాలు ఒక్కటి కాలేవనే విషయాన్ని అంగీకరించాల్సి వచ్చింది. ప్రస్తుతం మేమున్న పరిస్థితులు, ఎదుర్కొంటున్న బాధ్యతల దృష్ట్యా విడిపోవడమే సరైన మార్గమని భావించాము` అని ప్రకటనలో రాసుకొచ్చారు.

జీవితంలో ఎంతో కీలకమైన ఈ పరిణామ సమయంలో తమ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చి గోప్యతను పాటించాలని ఆకృతి మీడియాను, అభిమానులను విజ్ఞప్తి చేశారు. ఈ మార్పును తట్టుకుని ముందుకు సాగేందుకు తమకు కొంత సమయం, ప్రశాంతత అవసరమని కోరారు. తమ బంధం పట్ల ఎల్లప్పుడూ అభిమానం చూపించిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

మార్చి నెలలో పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ ఎంతో వైభవంగా ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థ విషయాన్ని ప్రపం చానికి వెల్లడించారు. ఆ సమయంలో పంచుకున్న నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రీడా, సినీ లోకానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు జంటకు అభినందనలు తెలిపారు. అయితే ఆరు నెలలు తిరగకముందే విడిపోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

టీమిండియా ఓపెనర్‌గా సుపరిచితుడైన పృథ్వీ షా మైదానంలో అద్భుత బ్యాటింగ్‌తో ఎంతగా మెరిసారో? పలు సందర్భాల్లో వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలిచారు. ఇక ఆకృతి అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు పలు ప్రాజెక్ట్‌లతో నటిగానూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఎంతో చూడముచ్చటగా కనిపించిన జంట బంధం ఇలా ముగిసిపోవడం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

నిశ్చితార్థం రద్దయిన వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఇద్ద‌రి నిర్ణయంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా? ఒకరిపై ఒకరు గౌరవభావంతో, సామరస్యపూర్వకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి, వారి వృత్తిగత జీవితాల్లో ఇద్దరూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.