Begin typing your search above and press return to search.

హీరో ప్రిన్స్ పెళ్లి డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడో తెలుసా?

అయితే ఇప్పుడు మరో ప్రేమ జంట పెళ్లికి సిద్ధమయ్యింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో ప్రిన్స్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

By:  Madhu Reddy   |   10 Aug 2026 8:22 PM IST
హీరో ప్రిన్స్ పెళ్లి డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడో తెలుసా?
X

ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఒకరి తర్వాత ఒకరు బ్యాచిలర్ లైఫ్ వీడుతూ వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి హీరోలు బ్యాచిలర్ లైఫ్ వీడి తాము ఇష్టపడిన అమ్మాయిలతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు మరో ప్రేమ జంట పెళ్లికి సిద్ధమయ్యింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో ప్రిన్స్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రిన్స్..

న్యూజిలాండ్ లో నివసిస్తున్న ఎన్ఆర్ఐ సాయి మాచిరాజుతో ప్రిన్స్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గత నెలలో సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకొని సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన ఈయన..ఇప్పుడు ఆగస్టు 24వ తేదీన న్యూజిలాండ్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని హీరో ప్రిన్స్ అధికారికంగా తెలియజేస్తూ.. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. హీరో ప్రిన్స్ బ్యాచిలర్ లైఫ్ వీడి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టబోతుండడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు, నెటిజన్స్ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రిన్స్ కాబోయే భార్యతో పరిచయం, ప్రేమ..

వీరిద్దరి మధ్య పరిచయం, ప్రేమ ప్రయాణం చాలా ఆసక్తికరంగా మొదలైంది. గత ఏడాది సెప్టెంబర్ లో ఒక కామన్ ఫ్రెండ్ వివాహ వేడుకలో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే మంచి స్నేహంగా మారగా.. ఇద్దరి అభిరుచులు కలవడంతో అది కాస్త ప్రేమకు దారితీసింది. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.. ఇదిలా ఉండగా.. తన కాబోయే భార్యకు ప్రపోజ్ చేసిన ఒక ప్రత్యేకమైన వీడియోని ప్రిన్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోగా.. ఆ ప్రపోజల్ పార్టీలో ప్రిన్స్ స్నేహితుడు ప్రియదర్శి పాల్గొనడం గమనార్హం. పైగా వీరిద్దరికీ ప్రియదర్శి కామన్ ఫ్రెండ్ కావడం మరో విశేషం.

ప్రిన్స్ మూవీ కెరియర్..

బస్ స్టాప్ సినిమాతో హీరోగా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రిన్స్.. నీకు నాకు డ్యాష్ డ్యాష్ వంటి చిత్రాలతో యువతకు చేరువయ్యారు. దర్శకుడు తేజ పరిచయం చేసిన ఈయన.. ఆ తర్వాత విభిన్న పాత్రలు, విలన్ రోల్స్ చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. అలాగే తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొని తన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇటీవల కాలంలో డీ.జే.టిల్లు, స్కంద వంటి చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.