Begin typing your search above and press return to search.

గ్రాండ్ గా ప్రిన్స్ సెసిల్ పెళ్లి రిసెప్షన్.. సందడి చేసిన టాలీవుడ్ సెలబ్రిటీస్!

టాలీవుడ్ ప్రేక్షకులకు 'బస్ స్టాప్', 'డీజే టిల్లు' వంటి చిత్రాలతో బాగా దగ్గరైన నటుడు ప్రిన్స్ సిసిల్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

By:  Madhu Reddy   |   24 Sept 2026 8:37 PM IST
గ్రాండ్ గా ప్రిన్స్ సెసిల్ పెళ్లి రిసెప్షన్.. సందడి చేసిన టాలీవుడ్ సెలబ్రిటీస్!
X

టాలీవుడ్ ప్రేక్షకులకు 'బస్ స్టాప్', 'డీజే టిల్లు' వంటి చిత్రాలతో బాగా దగ్గరైన నటుడు ప్రిన్స్ సిసిల్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌లో సెటిల్ అయిన తన స్నేహితురాలు సాయి ప్రతిమ మాచిరాజుతో గత నెల 24న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఆయన, తాజాగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ ఇచ్చారు. సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించిన ఈ వేడుకకు సంబంధించిన స్పెషల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.




న్యూజిలాండ్‌లో పెళ్లి.. హైదరాబాద్‌లో వేడుక :

ప్రిన్స్ సిసిల్, సాయి ప్రతిమల వివాహం న్యూజిలాండ్‌లో అత్యంత వైభవంగా జరిగింది. అమ్మాయి అక్కడే నివసిస్తుండటంతో ఇరు కుటుంబాల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఈ పెళ్లి నిర్వహించారు. ఇక ఆ తర్వాత బుధవారం రాత్రి హైదరాబాద్‌లో టాలీవుడ్ మిత్రులు, శ్రేయోభిలాషుల కోసం ప్రత్యేకంగా గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో కొత్త జంట ఎంతో సంతోషంగా కనిపించింది.




రిసెప్షన్‌లో కొత్త జంట రాయల్ లుక్ :

రిసెప్షన్ వేడుకలో ప్రిన్స్, సాయి ప్రతిమ ధరించిన అవుట్‌ఫిట్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రిన్స్ తెల్లటి డిజైనర్ షేర్వాణీలో రాయల్ లుక్‌లో మెరవగా, సాయి ప్రతిమ డీప్ రాయల్ బ్లూ కలర్ స్లీవ్‌లెస్ లెహంగా గౌనులో ఎంతో రాచరికపు కళతో అట్రాక్టివ్‌గా కనిపించారు. మెడలో డైమండ్ నెక్‌లేస్, ఓపెన్ హెయిర్, నుదుటిన చిన్న బిందీతో వధువు సాయి ప్రతిమ దేవతలా మెరిసిపోయారు.




అలరించిన టాలీవుడ్ సెలబ్రిటీలు:

హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటులు, దర్శకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విక్టరీ వెంకటేష్, సీనియర్ నటుడు శ్రీకాంత్, తరుణ్, ఆది సాయికుమార్, దర్శకుడు ఓంకార్ తదితర సెలబ్రిటీలు స్వయంగా వచ్చి నూతన దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక వారితో దిగిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.




ప్రిన్స్ సినీ ప్రయాణం:

వైజాగ్ నుంచి వచ్చిన ప్రిన్స్, మారుతి దర్శకత్వంలో వచ్చిన 'బస్ స్టాప్' సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'నేను శైలజ', 'డీజే టిల్లు' వంటి సినిమాల్లో పవర్‌ఫుల్ సపోర్టింగ్ రోల్స్ చేసి మెప్పించారు. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌లో పాల్గొని తనదైన వ్యక్తిత్వంతో అభిమానులను సంపాదించుకున్న ప్రిన్స్, ఈ ఏడాది 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' చిత్రంలోనూ కనిపించారు.




ఇక కెరీర్ పరంగా విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్న ప్రిన్స్ సిసిల్, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగిన రిసెప్షన్ వేడుక పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటుండగా, కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ నూతన జంటకు అభిమానులు మరియు టాలీవుడ్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.