బైకర్ ప్రెట్టీ బేబీ సాంగ్.. శర్వా స్టైలిష్ డాన్స్ ట్రీట్..!
ఈ సినిమా నుంచి ఆమధ్య వచ్చిన టీజర్ అంచనాలు పెంచగా లేటెస్ట్ గా బైకర్ నుంచి ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజైంది. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఈ సాంగ్ ఇంప్రెస్ చేసింది.
By: Ramesh Boddu | 14 Nov 2025 9:46 AM ISTశర్వానంద్ హీరోగా అభిలాష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా బైకర్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ స్క్రీన్ మీద తొలి బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా ఇదే అవ్వడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా నుంచి ఆమధ్య వచ్చిన టీజర్ అంచనాలు పెంచగా లేటెస్ట్ గా బైకర్ నుంచి ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజైంది. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఈ సాంగ్ ఇంప్రెస్ చేసింది.
జిబ్రాన్ మ్యూజిక్ కి శర్వా స్టెప్పులు.
శర్వానంద్ ఈ సాంగ్ లో స్టైలిష్ డ్యాన్స్ తో అదరగొట్టాడు. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కి అన్ని విభాగాల్లో తమ హీరో అదరగొట్టాలనే ఆలోచన ఉంటుంది. అందుకే సాంగ్స్ మీద ప్రత్యేకంగా డ్యాన్స్ మీద యువ హీరోలు స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. శర్వానంద్ ఇదివరకు కూడా డ్యాన్స్ బాగానే చేశాడు. కానీ ప్రెట్టీ బేబీ సాంగ్ లో డ్యాన్స్ మాత్రం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు.
ప్రెట్టీ బేబీ టైటిల్ లానే ఈ సాంగ్ కూడా ప్రెట్టీగా అనిపిస్తుంది. శర్వానంద్ తో మాళవిక నాయర్ కూడా తన లుక్స్ తో ఆకట్టుకుంది. సాంగ్ క్యాచీగా ఉండటంతో పాటు ఆడియన్స్ కి నచ్చేలా కంపోజింగ్ ఉంది. శర్వానంద్ బైకర్ నుంచి ప్రెట్టీ బేబీ ఫస్ట్ సాంగ్ గా రిలీజైంది. ఈ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ కాబోతుంది. అందుకే మేకర్స్ సినిమా ప్రమోషన్స్ దూకుడు పెంచారు.
బైకర్ లో ఇలాంటి సాంగ్ అంటే..
ఐతే బైకర్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా.. అలాంటి సినిమాలో ఇలాంటి సాంగ్ ఏంటని కొందరు డౌట్ పడుతున్నారు. కానీ హీరోగా అన్ని ఎలా అయితే పర్ఫెక్ట్ ఫీస్ట్ ఇవ్వాలో సినిమాకు వచ్చిన ఆడియన్స్ కు డైరెక్టర్ గా అభిలాష్ అటు స్టోరీ, స్క్రీన్ లో బైక్ రేసింగ్ ఎక్స్ పీరియన్స్ తో ఆకట్టుకుంటూనే కాస్త ఉల్లాసంగా ఉండేందుకు ఇలా ప్రెట్టీ బేబీ సాంగ్ లాంటివి ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఐతే శర్వా స్టైలిష్ లుక్స్ తో పాటు అతని డ్యాన్స్ కూడా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది.
కెరీర్ లో వరుస ఫ్లాపులతో చాలా కన్ ఫ్యూజన్ లో ఉన్న శర్వానంద్ ఈసారి చాలా పకడ్బందీ ప్లానింగ్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది. బైకర్ డిసెంబర్ లో వస్తుంటే నెక్స్ట్ నారి నారి నడుమ మురారి సినిమా సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టారు. ఐతే అది సంక్రాంతి నుంచి వాయిదా పడే ఛాన్స్ లు ఉన్నాయన్నట్టు తెలుస్తుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు.
