విజనరీ 'ప్రేరణ'.. పాన్ ఇండియా చిత్రాలతో దూకుడు
నిజానికి.. ప్రేరణ ఆరోరా పుట్టిన రోజు నేడు. అందుకే కొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. అయితే ఆ సినిమాను ప్రముఖ జీ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు.
By: M Prashanth | 8 Dec 2025 5:45 PM ISTవిజనరీ నిర్మాత ప్రేరణ అరోరా.. తెలుగు సినీ ప్రియులకు కూడా సుపరిచితురాలు. రీసెంట్ గా యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన జటాధర మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ తో అందరినీ ఆకట్టుకున్నారు.
అయితే జటాధర కన్నా ముందు అనేక హిందీ సినిమాల నిర్మాణంలో భాగమయ్యారు. 2016లో క్రిఆర్జ్ ఎంటర్టైన్మెంట్స్ (KriArj Entertainment) నిర్మాణ సంస్థను మొదలుపెట్టిన ప్రేరణ ఆరోరా.. అదే ఏడాది రుస్తం మూవీని రూపొందించారు. సురేష్ దేశాయ్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా ఆ సినిమాను నిర్మించారు.
ఆ తర్వాత ఏడాదిలో టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ మూవీని నిర్మించిన ప్రేరణ.. 2018లో వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనేక సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా బాధ్యత వహించారు. సామాజిక ఇతివృత్తాలతో కూడిన పలు సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించి బాక్సాఫీస్ వద్ద విజయాలు అందుకున్నారు.
ప్యాడ్ మ్యాన్, కేదార్ నాథ్, పరీ, పర్మాణు: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్, బట్టి గుల్ మీటర్ చాలు వంటి ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రేరణ అరోరా పాలుపంచుకున్నారు. తద్వారా బాలీవుడ్ లో మంచి విజన్ ఉన్న యంగ్ ఉమెన్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా బీటౌన్ లో సొంతం చేసుకున్నారు.
ఆమె చేస్తున్న ప్రాజెక్టులు కేవలం హిందీ చిత్రసీమలోనే కాక.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా విశేష ఆదరణ అందుకుని సత్తా చాటుతున్నాయి. ఇటీవల సుధీర్ బాబు జటాధర సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. ఇప్పుడు కొత్త పాన్ ఇండియా అడ్వెంచర్ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
నిజానికి.. ప్రేరణ ఆరోరా పుట్టిన రోజు నేడు. అందుకే కొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. అయితే ఆ సినిమాను ప్రముఖ జీ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్ తో సంయుక్తంగా రూపొందించనున్నారు ప్రేరణ. అలా జీ స్టూడియోస్ తో కలిసి క్రిఅర్జ్ ఎంటర్టైన్మెంట్స్ పై మూడో మూవీ తీయనున్నారు.
ఇప్పటికే జీ స్టూడియోస్, క్రిఅర్జ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా రుస్తం, జటాధర చిత్రాలు రూపొందించగా.. ఇప్పుడు మరో సినిమా నిర్మించనుంది. జటాధర పాన్ ఇండియా మూవీనే కాగా.. ఇప్పుడు కూడా పాన్ ఇండియా చిత్రమే రూపొందించనుండడం గమనార్హం. త్వరలో మరిన్ని మంచి చిత్రాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ప్రేరణకు Tupaki తరఫున ఆల్ ది బెస్ట్ తో పాటు బర్త్ డే విషెస్ కూడా.
