నటికి లవ్ యూ చెబితే అన్నయ్య సీన్లోకి!
మాలీవుడ్ బ్యూటీ మమితా బైజు `ప్రేమలు` సక్సెస్ తో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఒక్క హిట్ అమ్మడికి రెండు భాషల్లో అవకాశాలు తెచ్చి పెడుతుంది.
By: Srikanth Kontham | 22 Dec 2025 12:00 AM ISTమాలీవుడ్ బ్యూటీ మమితా బైజు `ప్రేమలు` సక్సెస్ తో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఒక్క హిట్ అమ్మడికి రెండు భాషల్లో అవకాశాలు తెచ్చి పెడుతుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది. కోలీవుడ్ లో ఏకంగా స్టార్ హీరోలతోనే ఛాన్స్ లందుకుంటుంది. విజయ్ హీరోగా నటిస్తోన్న `జన నాయగన్` లో సెకెండ్ లీడ్ పోషిస్తుంది. మెయిన్ లీడ్ లో పూజాహెగ్డే నటిస్తుండగా...సెకెండ్ లీడ్ దక్కించుకుంది.ఇవి సెట్స్ లో ఉండగానే ధనుష్, సూర్య సరసన కూడా ఛాన్సులందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాలు కూడా ఆన్ సెట్స్ లో ఉన్నాయి.
ఇదంతా `ప్రేమలు` చిత్ర విజయంతోనే? ఓ అనువాద విజయంతో ఈ రేంజ్ లో అవకాశాలు అందుకున్న ఏకైక నటి కూడా ఈ బ్యూటీనే. ఆమెలో ప్రతిభను గురించే దర్శక శిఖరం రాజమౌళి సైతం ఆమెను సాయి పల్లవితో పోల్చారు? అన్నది కాదనలేని నిజం. ఆ సంగతి పక్కన బెడితే? ఈ అమ్మడికున్న సోషల్ మీడియా ఫోలాయింగ్ కి రోజు ఎన్నో లవ్ ప్రపోజల్స్ వస్తుంటాయి. ఎంతో మంది ఐలవ్ యూ అంటూ మెసెజ్ లు పెడుతుంటారు. కొంత మంది సోషల్ మీడియా ఖాతాల ద్వారా మరికొంత మంది నేరుగా ఫోన్ నెంబర్ కే పెడుతుంటారు. అయితే ఇలాంటి వ్యవహారాలన్నింటిని మమిత అన్నయ్య మిథున్ డీల్ చేస్తాడని తెలిపింది.
మిథున్ రాష్ట్ర స్థాయి క్రికెట్ ప్లేయర్ . పేరుకే ఇద్దరు అన్నాచెల్లెళ్లులం అని క్లోజ్ ప్రెండ్స్ లా ఉంటామంది. కుటుంబం, చదువు ఇలా ప్రతీ విషయంలో మిథున్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందిట. అతడిని అడిగే అన్ని నిర్ణయాలు తీసుకుం టుందిట. చివరికి పెళ్లి కొడుకు విషయంలో కూడా అతడిని డిసైడ్ చేయాల్సింది అన్నయ్యే అనేసింది. తనకి వచ్చే లవ్ ప్రపోజల్స్ అన్నింటిని తానే డీల్ చేస్తాడని తెలిపింది. తాను నటిని కాబట్టి ఇలాంటి వన్నీ సహజంగా వస్తుంటాయని తెలుసుకుని వాళ్లపై కొపగించుకోకుండా? ప్రశాంతంగా వీలైనంత మందికి రిప్లై ఇస్తాడని తెలిపింది.
ఆకతాయిల పోస్టులకు కూడా అంతే ధీటుగా రిప్లై ఉంటుందని చెప్పింది. మొత్తానికి అన్నయ్య లో అన్ని రకాల కోణాలు ఉన్నాయని మమిత మాటల్లో బయట పడింది. మరి అమ్మడు ప్రేమలో పడినా? అన్నయ్యను అనుమతి తీసుకునే ప్రేమిస్తుందో? ఏమో! ఇంత వరకూ మమిత ఎవరితోనూ ప్రేమలో పడలేదు. నటనపైనే దృష్టి పెట్టి పని చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. దీంతో పారితోషికం కూడా బాగానే డిమాండ్ చేస్తోంది.
