స్టార్ డైరెక్టర్ లైనప్ దూకుడే దూకుడు!
'96', 'సత్యం సుందరం' లాంటి చిత్రాలతో టాలీవుడ్ లోనూ ఫేమస్ అయిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్.
By: Srikanth Kontham | 11 Sept 2025 4:00 PM IST'96', 'సత్యం సుందరం' లాంటి చిత్రాలతో టాలీవుడ్ లోనూ ఫేమస్ అయిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్. రెండు విజయాలతో ప్రేమ్ కుమార్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. 96 తో స్వచ్ఛమైన ప్రేమ కథ... సత్యం సుందరంలో కుటుంబ అనుబంధాలు..భాంధావ్యాలను ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ చేసాడు. స్టార్ హీరోలంతా ఇప్పుడతడితో సినిమాలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. సూర్య కూడా ఈ మధ్యనే తనతో సినిమా చేయాలని ఉందని బాహాటంగా ప్రకటించారు. ఆ సంగతి పక్కన బెడితే! ప్రస్తుతం ప్రేమ్ కుమార్ లైనప్ మాత్రం స్ట్రాంగ్ కనిపిస్తోంది.
తొమ్మిది పాత్రలతోనే ఓ సినిమా:
'96' కి సీక్వెల్ గా పార్ట్ -2 ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే తాజాగా మరి కొన్ని ప్రాజెక్ట్ లు ప్రకటించారు. మలయాళ నటుడు ఫహాద్ పాజిల్ తో ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదొక భిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఈ సినిమాలో చాలా తక్కువ పాత్రలుంటాయన్నారు. ఇప్పటి వరకూ ఆయన చేసిన సినిమాల్లో పాత్రలు అధికంగా ఉన్న నేపథ్యంలో? అందుకు భిన్నంగా ప్లాన్ చేసారిలా. ఈ సినిమా అనంతరం ఓ అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్ తెరకెక్కిస్తానన్నారు.
ఆ సినిమాల్లో నటీనటులెవరు?
ఇందులో కూడా కేవలం తొమ్మిది పాత్రలు మాత్రమే తెరపై కనిపిస్తాయన్నారు. అలాగే హీరోయిన్ లేకుండా మరో సినిమా ప్రేమ కథని కూడా తెరకెక్కిస్తానన్నారు. అయితే ఈ సినిమాల్లో నటీనటులు ఎవరు? ఏ నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి? అన్నది మాత్రం వెల్లడించలేదు. దీంతో ఇప్పుడీ ప్రాజెక్ట్ ల్లో నటులుఎవరవుతారు? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రేమ్ కుమార్ సినిమాల్లో భాగమవ్వాలని చాలా మంది నటులు ఆశీస్తున్నారు. స్టార్ హీరోలే అతడితో మంచి ఫ్యామిలీ స్టోరీలు..అనుబంధాల నేపథ్యం గల కథల్లో నటించాలని అడుగుతున్నారు.
స్టార్స్ కంటే కథకు తగ్గ హీరోతోనే:
కానీ ఆయన హీరోలు మాత్రం చాలా సెలక్టివ్ గా ఉన్నారు. స్టార్స్ కంటే? తన కథకు ఎలాంటి నటుడైతే? సరి తూగుతాడో వాళ్లతోనే ముందుకెళ్తున్నారు. పహాద్ పాజిల్ కేవలం మాలీవుడ్ లోనే ఫేమస్. కానీ తాను రాసిన కథకు అతడు మాత్రమే సెట్ అవుతాడని భావించి తదుపరి ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నారు. అలాగే `తను` హీరో విక్రమ్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి మాత్రం ఇంత వరకూ ప్రేమ్ కుమార్ ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదు.
