Begin typing your search above and press return to search.

96 డైరెక్టర్ ఆ స్టార్ తో క్రేజీ ప్రాజెక్ట్..!

అదే సినిమా తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్ తో వచ్చింది. సినిమా సింపుల్ ఎమోషన్స్ తో మెప్పించింది. ఐతే ప్రేమ్ కుమార్ తన థర్డ్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

By:  Ramesh Boddu   |   10 Sept 2025 9:29 AM IST
96 డైరెక్టర్ ఆ స్టార్ తో క్రేజీ ప్రాజెక్ట్..!
X

విజయ్ సేతుపతి త్రిష కలిసి నటించిన 96 సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ప్రేమ్ కుమార్ ఆ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమానే తెలుగులో కూడా జాను అంటూ రీమేక్ చేశాడు. జాను కోసం ప్రేమ్ కుమార్ నే తెలుగుకి తీసుకొచ్చారు. ఐతే 96 డైరెక్టర్ పై ఆ ఒక్క సినిమాతోనే స్పెషల్ అటెన్షన్ ఏర్పడింది. ఆ డైరెక్టర్ ఆఫ్టర్ 7, 8 ఇయర్స్ కార్తితో మేయళగన్ సినిమా చేశాడు ప్రేమ్ కుమార్.

ప్రేమ్ కుమార్ తన థర్డ్ ప్రాజెక్ట్..

అదే సినిమా తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్ తో వచ్చింది. సినిమా సింపుల్ ఎమోషన్స్ తో మెప్పించింది. ఐతే ప్రేమ్ కుమార్ తన థర్డ్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈసారి అతను మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ తో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు ప్రేమ్ కుమార్. ఫహద్ తో కథా చర్చలు ముగిసినట్టు చెప్పారు.

థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా ఉంటుందని ఐతే తన మార్క్ ఎమోషనల్ సీన్స్ కూడా మెప్పిస్తాయని అంటున్నారు ప్రేం కుమార్. సో ఫహద్ తో ప్రేమ్ కుమార్ సినిమా లాక్ అయినట్టే. ప్రేమ్ కుమార్ డైరెక్షన్ టాలెంట్ తెలుసు కాబట్టి ఫహద్ ఫాజిల్ తో అతనొక మంచి సూపర్ హిట్ సినిమా తీస్తాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ఫహద్ ఫాజిల్ ఆవేశం తో సూపర్ హిట్ అందుకోగా ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కాస్త వెనకపడ్డాడు.

సోలో సినిమాలకే ప్రిఫరెన్స్..

మలయాళంలో లాస్ట్ వీక్ కూడా లోక, హృదయపూర్వంతో ఒక సినిమాతో వచ్చాడు ఫహద్. ఆ సినిమా అసలేమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. ఫహద్ ఫాజిల్ కూడా ఇక మీదట వేరే సినిమాల్లో నటించడం కన్నా సోలో సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. పుష్ప 2 సినిమాలో అతని పాత్ర చూసి ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. ఐతే ఆల్రెడీ చేసిన సినిమా వల్ల చేసేదేమి ఉండదు. అందుకే ఇక సోలో సినిమాలే చేసి తన సత్తా చాటాలని చూస్తున్నాడు ఫహద్ ఫాజిల్.

ఈ క్రమంలోనే ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో సినిమా అనగానే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. మలయాళంలోనే కాదు ఫహద్ కి సౌత్ లో సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. అతను మళ్లీ ఒక సూపర్ హిట్ తో కంబ్యాక్ ఇస్తే చూడాలని కోరుతున్నారు. ప్రేం కుమార్ సినిమా ఆ సక్సెస్ అందిస్తుందని నమ్ముతున్నారు. ఫహద్ ఫాజిల్ కూడా ఇక మీదట స్టోరీ సెలక్షన్ లో చాలా జాగ్రత్త పడాలని ఫిక్స్ అయ్యారు. వరుస సినిమాల ఫెయిల్యూర్ వల్ల ఫహద్ గ్రాఫ్ పడిపోతుంది అందుకే నెక్స్ట్ సినిమా తానేంటో ప్రూవ్ చేసుకోవాలని గట్టి ప్రయత్నంలో ఉన్నాడు.