Begin typing your search above and press return to search.

30 ఏళ్ల యాక్టింగ్ కేరీర్.. కానీ తన సినిమాలు తానే చూడని న‌టి!

మూడు ద‌శాబ్దాలుగా సినీ పరిశ్రమలో కథానాయికగా ఏలిన ప్రీతి జింటా నటనతో, చిరునవ్వుతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ప్ర‌త్యేక‌మైన స్థానం సంపాదించుకున్నారు.

By:  Srikanth Kontham   |   12 Sept 2026 12:58 PM IST
30 ఏళ్ల యాక్టింగ్ కేరీర్.. కానీ తన సినిమాలు తానే చూడని న‌టి!
X

మూడు ద‌శాబ్దాలుగా సినీ పరిశ్రమలో కథానాయికగా ఏలిన ప్రీతి జింటా నటనతో, చిరునవ్వుతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ప్ర‌త్యేక‌మైన స్థానం సంపాదించుకున్నారు. `దిల్‌సే` చిత్రం తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సొగసరి స్వల్ప వ్యవధిలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. హిందీతో పాటు తెలుగు, తమిళ చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ముద్దుగా డింపుల్ బ్యూటీ అని పిలుచుకునే ప్రీతి జింటా ఇటీవల తన సినీ ప్రయాణానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచారు.

ఇండస్ట్రీలో ముప్పై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నా? తన సొంత సినిమాలను తానెప్పుడూ చూడనని ప్రీతి జింటా పూర్కొన్నారు. చాలామంది నటీనటులు తమ నటనా శైలిని విశ్లేషించుకోవడానికి లేదా పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి తమ చిత్రాలను పదే పదే చూస్తుంటారు. కానీ ప్రీతి మాత్రం తన సినిమాలను తిరిగి చూడటానికి అస్సలు ఇష్టపడన‌న్నారు. స్క్రీన్‌పై త‌న‌ని తాను చూసుకోవడం కొంత అసౌకర్యంగా అనిపి స్తుంద‌న్నారు.

మ‌రి ఎందుకిలా అంటే? వెండితెరపై తన నటనను చూస్తున్నప్పుడు ఏవైనా లోపాలు కనిపిస్తే తీవ్ర నిరాశకు గురవుతుందిట‌. `ఆ సన్నివేశంలో ఇంకా బాగా నటించి ఉంటే బాగుండేదని లేదా? హావాభావాలు సరిగ్గా పండలేదు` అనే ఆలోచనలు మనస్సులో నిరంతరం తిరుగుతుంటాయని తెలిపారు. పూర్తి చేసిన పని గురించి ఆ తర్వాత విశ్లేషించి బాధపడటం కంటే.. దాన్ని అక్కడితో వదిలేసి ముందడుగు వేయడమే శ్రేయస్కరమని ప్ర‌తీజింటా అభిప్రాయ‌ప‌డ్డారు.

తాను ఏ సినిమాకు క‌మిట్ అయినా? చిత్రీకరణ పూర్తయి సినిమా విడుదలైన వెంటనే తన బాధ్యత ముగిసి పోయినట్లేనని ప్రీతి నమ్ముతారు. సినిమా విడుదల తర్వాత వచ్చే ప్రేక్షకుల ప్రతిస్పందన, వారి ఆదరణ మాత్రమే ముఖ్యమని వెల్లడించారు. ప్రదర్శన పూర్తయిన తర్వాత తిరిగి పాత వర్క్‌ను సమీక్షించుకోవడం వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుందని.. అందుకే తన సినిమాలకు దూరంగా ఉంటానని డింపుల్ పేర్కొన్నారు.

అయితే కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకోకుండా టీవీలో త‌న సినిమాలు ప్రసారమైతే వెంటనే ఆ ఛానెల్ మార్చేస్తారట. పిల్లలు.. భర్త ఆ సినిమాలను చూస్తున్నా కూడా ప్రీతి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతారట. తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన సినిమాలను వేర్వేరుగా ఉంచడానికే ప్రీతీ జింటా మొదటి నుంచీ ప్రాధాన్యత ఇస్తున్నారు.

సినిమా రంగంలో ఎంతటి ఘనవిజయం సాధించినా? ప్రతి ఒక్క నటుడికి పని పట్ల ప్రత్యేకమైన దృక్పథం ఉంటుందనడానికి ప్రీతి జింటా విధానమే నిదర్శనం. గత చిత్రాల విజయాలపై కూర్చుని సమయం వృధా చేయకుండా వర్తమానంలో జీవించడాన్ని అమ్మ‌డు ఇష్టపడతారు. ముప్పై ఏళ్ల ప్రయాణంలో ఎన్నో చిరస్మ రణీయమైన చిత్రాలను అందించిన అందాల నటి విలక్షణమైన అలవాటుతో అభిమానుల్లో మరొకసారి చర్చనీయాంశమవుతున్నారు.