'కన్నప్ప' నెమలి అక్కడా షురూ !
చెన్నై బ్యూటీ ప్రీతీ ముకుందన్ టాలీవుడ్ లో 'కన్నప్ప' చిత్రంతో వెలుగులోకి వచ్చి నటి. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమాలో అమ్మడు నెమలి అనే పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
By: Srikanth Kontham | 29 Jan 2026 11:54 AM ISTచెన్నై బ్యూటీ ప్రీతీ ముకుందన్ టాలీవుడ్ లో 'కన్నప్ప' చిత్రంతో వెలుగులోకి వచ్చి నటి. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమాలో అమ్మడు నెమలి అనే పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఫలించలేదు. అందం.. అభినయం గల నాయికే అయినా? 'కన్నప్ప' వైఫల్యంతో నెమలి పాత్రతో అనుకున్నంతగా రీచ్ అవ్వలేదు. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ ఛాన్స్ రాలేదు. అయితే టాలీవుడ్ లో శ్రీవిష్ణు హీరోగా నటించిన 'ఓం బీమ్ భుష్' అనే చిత్రంతోనే లాంచ్ అయింది. కానీ ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. 'కన్నప్ప' పాన్ ఇండియా రిలీజ్ కావడంతో తెలుగు జనాలకు రీచ్ అయింది.
సక్సెస్ అయితే గుర్తింపు దక్కేది. అలాగే తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. వాటి ఫలితాలు కూడా నిరాశనే మిగిల్చాయి. తాజాగా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకటి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రముంది. అలాగే 'నాగ్ జిల్లా' అనే మరో చిత్రం ఉంది. ఈ రెండింటిలో ఒక సినిమాలో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీతీతో చిత్ర నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు.
అవి రెండు రోజుల్లో ఓ కొలిక్కి రానున్నాయి. అనంతరం అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు. అవకాశం వస్తే? అమ్మడు అదృష్టవంతురాలే. బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎంతో మంది హీరోయిన్లు క్యూలో ఉన్నారు. చిన్న సినిమాలో ఛాన్స్ వచ్చినా? నటించాలని ఎదురు చూస్తున్నారు. అలాంటిది ప్రీతికి ఏకంగా కార్తీర్ ఆర్యన్ ప్రాజెక్ట్ లోనే ఛాన్స్ అందుకుంటుంది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ కెరీర్ స్వింగ్ లో ఉంది. వరుస విజయాలతో దూసు కుపోతున్నాడు. అతడి సరసన నటించిన హీరోయిన్లకు మంచి గుర్తింపు దక్కింది. దీంతో కొత్త అవకాశాలతో బిజీ అవుతున్నారు.
ప్రతీ ముకుందన్ కూడా అంతటి అదృష్ట వంతురాలు అవ్వాలని ఆశీద్దాం. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో సౌత్ భామలు ఎక్కువగా అవకాశాలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే. రష్మికా మందన్నా, సమంత, శ్రీలీల, కీర్తి సురేష్ లాంటి వారికి బాలీవుడ్ ప్రాధాన్యత ఇస్తుంది. యంగ్ హీరోలకు పర్పెక్ట్ భామలుగా ఎంపిక అవుతున్నారు. వారి జాబితో ప్రీతి ముకుందన్ కూడా చేరబోతుంది. ప్రీతీ మంచి విద్యావంతురాలు కూడా. ప్రతిష్టా త్మకమైన నీట్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చదువుతో పాటు చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో శిక్షణ పొందింది.
