Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కాదన్నా ఆ రెండు భాష‌ల్లో!

త‌మిళ‌ బ్యూటీ ప్రీతీ ముకుంద‌న్ `క‌న్న‌ప్ప‌`తోనే వెలుగులోకి వ‌చ్చింది. కానీ అమ్మ‌డు `ఓంభీమ్ భూష్` అంటూ చాలా కాలం క్రితమే టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించింది.

By:  Srikanth Kontham   |   15 Aug 2025 2:00 AM IST
టాలీవుడ్ కాదన్నా ఆ రెండు భాష‌ల్లో!
X

త‌మిళ‌ బ్యూటీ ప్రీతీ ముకుంద‌న్ `క‌న్న‌ప్ప‌`తోనే వెలుగులోకి వ‌చ్చింది. కానీ అమ్మ‌డు `ఓంభీమ్ భూష్` అంటూ చాలా కాలం క్రితమే టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించింది. కానీ ఆ సినిమా వైఫ‌ల్యం తో వెలుగులోకి రాలేక‌పోయింది. అందం, అభిన‌యం గ‌ల నాయికే అయినా? వైఫ‌ల్యం వెన‌క్కి నెట్టేసింది. గ్లామ‌ర్ డోస్ లోనూ ఏమాత్రం త‌క్కువ కాద‌ని సంద‌ర్భం దొరికిన ప్ర‌తీసారి స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేసింది. ఆ ర‌క‌మైన ఛాన్స్ తీసుకున్నా? అమ్మ‌డికి అదృష్టం క‌ల‌సి రాలేదు.

అవ‌కాశాలు..స‌క్స‌స్ లు రెండు లేక‌పోవ‌డంతో బాగా వెనుక‌బ‌డింది. చివ‌రికి మంచు ఫ్యామిలీ రూపంలో `క‌న్న‌ప్ప‌`లో న‌టించే ఛాన్స్ ద‌క్కింది. ఇందులో మెయిన్ లీడ్ పోషించింది. పాన్ ఇండియా సినిమా కావ డంతో స‌క్సెస్ గ్యారెంటీగా భావించింది. సినిమాలో శ‌క్తిమేర శ్ర‌మించింది. పాత్ర‌లో గ్లామ‌ర్ సైతం పండిం చింది. కానీ `క‌న్న‌ప్ప` ఫ‌లితం కూడా అమ్మ‌డిని తీవ్ర నిరాశ‌లోకి నెట్టేసింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో కొత్త ఛాన్సులేవి చేతిలో లేవు. దీంతో అమ్మ‌డు ఇత‌ర భాష‌ల‌పై దృష్టి పెట్టింది.

ప్ర‌స్తుతం మాలీవుడ్ లో `మైనే ప్యార్ కియా` అనే చిత్రంలో న‌టిస్తోంది. హృద్ హ‌రున్ ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. మిగ‌తా ప‌నులు పూర్తి చేసుకుని ఆగస్ట 29న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే అమ్మ‌డు మ‌రో రెండు మాలీవుడ్ ఛాన్సు లు అందుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ప్రాజెక్ట్ ల వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు గానీ ఛాన్సు లు మాత్రం ఒడిసి ప‌ట్టుకున్న‌ట్లు గ‌ట్టిగానే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అలాగే త‌మిళ్ లో కూడా మ‌రో రెండు సినిమాలు సైన్ చేసిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. మ‌రి వీటితోనైనా అమ్మ‌డు సౌత్ లో బిజీ అవుతుందేమో చూడాలి. ఆ స‌క్స‌స్ ల‌తో టాలీవుడ్ లో మ‌ళ్లీ కం బ్యాక్ అయినా అవ్వొచ్చు. వైఫ‌ల్యాలు ఎక్క‌డైనా స‌హ‌జం. వాటిని జ‌యించి ముందుకొచ్చిన వారి కెరీర్ కి తిరుగుండ‌దు. అలాంటి హీరోయిన్ల జాబితాలో ప్రీతి చేరుతుందేమో చూడాలి.